Thursday, October 22, 2020

డా.అట్లూరి సత్యనాధం(సత్య ఎన్

గుడివాడలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి, భగవంతుడు ఇచ్చిన మేధస్సు ద్వారా వివిధ వైవిద్యమైన బహుళ రంగాల మీద అధ్యయనం చేసి, ఎవరికి అతి సులువుగా అందని లక్ష్యాలను అందుకొని, తన విశిష్టతను తెలుసుకోవాలనే ప్రతివాడి హృదయంలో విద్యుత్ ఒక బిందువలె పుట్టి బహుముఖంగా ఒక ఉత్తేజపుంజమై విస్తరించి శరీరాన్ని జ్ఞానదాహంతో పులకింపజేసే మన తెలుగువాడు, 2013 లో పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత, డా.అట్లూరి సత్యనాధం(సత్య ఎన్ అట్లూరి) గారి పుట్టినరోజు ఈ రోజు.

విద్యాభ్యాసం: 

తణుకు,నెల్లూరు,కాకినాడ,అమలాపురం,రాజమండ్రి  నగరాల్లో  పభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతూ, కాకినాడ నగరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్లో  డిగ్రీ పూర్తి చేసి,ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1964 సంవత్సరం వి.కె.మూర్తి స్వర్ణ పతకం, 1965 లో లాజరస్ పురస్కారం పొంది, బెంగళూరులో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసుకొని మరింత ఉన్నత చదువుల కోసం అమెరికాలో మస్సాచ్యుసెట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశం పొంది,1969లో డాక్టరేట్ పట్టా పొందారు. 

గత నలభై సంవత్సరాలలో 300 మంది విద్యార్దులకు పైగా మార్గదర్శకత్వం వహించి, ఇప్పుడాయన టెక్సాస్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో విశిష్టాచార్యునిగా పనిచేస్తున్నారు.

ఆయన సాధించిన డాక్టరేట్లు, పురస్కారాలు కోకొల్లలు. ఆ వివరాలకోసం క్రింద లింక్ ను క్లిక్ చెయ్యండి.

https://www.depts.ttu.edu/me/faculty/satya_n_atluri/atluri_2015.pdf

No comments:

Post a Comment

గుడివాడ చరిత