Thursday, October 22, 2020

గుడివాడ, 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన పట్టణం.
పిన్ కోడ్ నం. 521 301.,
 ఎస్.టి.డి.కోడ్ = 08674.

గుడివాడ పట్టణ చరిత్ర ....
ఒకప్పుడు కళింగ రాజు పరిపాలనలో 'గుడివాడ' ఆంధ్రనగరం పేరుతో ప్రసిద్ధి చెందింది. రాజ్య విస్తరణలో భాగంగా అశోకుడు, కళింగ రాజు పై దండెత్తి ఓడించాడు. అప్పటి వరకు కళింగ రాజు పాలనలో వున్నా ఆంధ్ర ప్రజలు, యుద్ధంలో గెలిచిన అశోక చక్రవర్తిని రాజుగా అంగీకరించారు. క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై మూడు నాటికి అశోకుడు పరిపాలించే కాలంలో ఆంధ్ర నగరాలు మూడు పదులు వున్నై. కృష్ణాతీరంలో అశోకుని కాలానికి ఎన్నో బౌద్ధ కేంద్రాలు ప్రసిద్ధి చెందాయి. ఆ కాలంలో కృష్ణా నదికి ఇరువైపులా వున్నా పరచిన గ్రామాలన్నీ బౌద్ధ క్షేత్రాలే.

అమరావతి, భట్టిప్రోలు, నాగార్జునకొండ, జగ్గయ్య పేట, బోడపాడు, చందోలుతో 'గుడివాడ ' కూడా బౌద్ధ కేంద్రాలుగా గుర్తింపబడ్డాయి. కృష్ణా నది తీరంలో బౌద్ధ స్థూపాలను నిర్మించటానికి, బౌద్ధ మతం ప్రచారం పొందటానికి అశోకుడే కారణం. బుద్ధుని అస్తికలను నిక్షిప్తం చేసి, మహా చైత్యాలుగా మార్చాడు. చైత్యం అంటే 'చితి' కి సంబంధించిన ఎముకలని నిక్షిప్తం చేసిన స్తూపం. 1984 లో 'రీ' అనే పరిశోధకుడు, దాక్షిణాత్య బౌద్ధ శిల్పాలు - భట్టిప్రోలు, ఘంటసాల, గుడివాడ పురాతన స్తూపాలు' అన్న నివేదిక సమర్పించాడని, ఆ నివేదికను పుణీలో నార్ల వారు చదివానని చెప్పగా తెలిసింది. అందులో గుడివాడ 'దీపాల దిబ్బ' లో దొరికిన విదేశీ నాణాలు, బౌద్ధ క్షేత్ర ప్రాచీనతని తెలియ చేస్తోంది.

గుడివాడ పేరు వెనుక చరిత్ర 
కలువ పూలతో నిండి ఉన్న ఒక కొలను
గుడివాడని పూర్వం గుళ్ళవాడ అనేవారు. అది కాలక్రమేన గుడివాడగా మారింది. ఈ పట్టణములో చాలా గుడులు ఉన్నాయి.

గుడివాడ పట్టణ భౌగోళికం సవరించు
సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప పట్టణాలు
గుడివాడ, 
హనుమాన్ జంక్షన్,
 పెడన, 
ఏలూరు

సమీప మండలాలు 
నందివాడ, పెదపారుపూడి, గుడ్లవల్లేరు, పామర్రు.ముడినేపల్లి.

రవాణా సౌకర్యాలు...
గుడివాడ పట్టణము నుండి దగ్గర, దూర అన్నిప్రాంతముల వైపులకు బస్సు, రైలు తదితర రవాణా సౌకర్యములు ఉన్నాయి.
గుడివాడ ప్రాంతము నుండి భీమవరం, రాజొలు, నర్సాపురం, విశాఖపట్నం, బెజవాడ, తిరుపతి, బెంగులురు, హైదరాబాదు, మచిలీపట్నం రైల్వే, బస్ వసతులు ఉన్నాయి.
ఈ పట్టణము నుండి దాదాపుగా 30-35 కి.మీ. దగ్గరలో గన్నవరం విమానాశ్రయము ఉంది.
రైలు వసతి 
గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ లో నిలిచి, బయలు దేరుటకు సిద్దముగా ఉన్న సికింద్రాబాద్ - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్
గుడివాడ రైల్వే జంక్షన్.
గుడివాడ - విజయవాడ - భీమవరం - నరసాపురం - మచిలీపట్నం రైల్వే ట్రాక్ డబుల్, విధుయుతీకరణ లేక పోవటం ప్రధాన సమస్య.
గుడివాడ ప్రాంతం నుండి తిరుపతి, విశాఖపట్నం, ముంబై, షిరిడి, పురి, భిలాసాపూర్, భువనేశ్వర్, విజయవాడ, హైదరాబాదు రైళ్లు ఉన్నాయి.
గుడివాడ - విజయవాడ - భీమవరం - నరసాపురం - మచిలీపట్నం రైల్వే ట్రాక్ డబుల్ ట్రాక్ పనులు మొదలపెట్టేరు
సాధారణ బండ్లు 
గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషనులో నిలిచి ఉన్న ఒక ప్యాసింజర్ రైలు.
విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77213
విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77206
గుంటూరు - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57381
విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212
గుడివాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77219
విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77207
విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77201
విశాఖపట్నం - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57230
రైళ్లు వివరములు :
17049 - మచిలీపట్నం నుండి సికందరాబాద్.
17255 - నరసాపురం నుండి హైదరాబాదు.
17213 | 17231 - నరసాపురం నుండి నాగర్సొల్.
17210 - కాకినాడ నుండి బెంగళూరు.
17644 - కాకినాడ నుండి చెన్నపట్నం.
18519 - విశాఖపట్నం నుండి ముంబాయి.
17015 - విశాఖపట్నం నుండి హైదరాబాదు.
17404 - నరసాపురం నుండి తిరుపతి.
17479 - పూరి నుండి తిరుపతి.
17481 - భిళాస్పుర్ నుండి తిరుపతి.
గుడివాడ, వెంట్రప్రగడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. ఇదిరిఅల్వెజంక్షన్ విజయవాడ రైల్వేస్టేషన్: 44 కి.మీ

గుడివాడ పట్టణంలోని విద్యా సౌకర్యాలు 
గుడివాడ పట్టణంలోని మౌలిక సదుపాయాలు 
గుడివాడ పట్టణ పరిపాలన 
గుడివాడ పట్టణములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు సవరించు
శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం సవరించు
శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం సవరించు
ఇక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర వారి ఈ దేవాలయము ప్రసిద్ధి కల దేవాలయము. ఇక్కడ స్వామి వారి కల్యాణము ఒక పేద్ద మహొత్సవంలా జరుగుతాయి. ఈ ఆలయంలో, 2014, నవంబరు-3, సోమవారం నుండి, 6వ తేదీ గురువారం వరకు, స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, 6వ తేదీ గురువారం నాడు, స్వామివారికి స్నపనం, విశేష అలంకరణ, వేదవిన్నపం, చతుస్థానార్చన, సర్వ ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. ద్వారతోరణబలి, మహా పూర్ణాహుతి, పవిత్ర అవరోహణం, అనంతరం 108 కలశాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. మన గుడి కార్యక్రమం క్రింద తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అన్నదానసత్రంలో కార్తీక వనసమారాధన నిర్వహించారు.
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, జ్యేష్ఠమాసంలో, శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు వైభవంగా నిర్వహించెదరు. 
శ్రీ నాగమ్మ తల్లి దేవాలయము సవరించు
సింగరెపాలెం నాగమ్మ తల్లి దేవాలయము బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఇక్కడకి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న నాగమ్మ తల్లి బాగా మహిమ కల దేవతగా ఇక్కడ ఉన్న ప్రజలు కొలుస్తారు.

శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం సవరించు
ఈ ఆలయంలో 2014, నవంబరు-6వ తేదీ రాత్రి, కార్తీకపౌర్ణమి సందర్భంగా, నాలుగున్నర కోట్ల దీపాలతో దీపోత్సవాన్ని నిర్వహించారు. పురవీధులలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. భక్తులు వేలాదిగా వెంటరాగా, ఆలయం ఎదుట జ్వాలాతోరణాన్ని వెలిగించారు. జ్వాలాతోరణం విభూతిని వ్యాపారం నిర్వహించే దుకాణాలలోగానీ, ఇళ్ళలోగానీ ఉంచితే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతవని ఆలయ పురోహితులు తెలిపినారు. 

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం సవరించు
ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017, మార్చి-13వతేదీ సోమవారంనాడు, ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, శాంతికళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు నగరోత్సవం నిర్వహించెదరు. 

శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం...
ఈ ఆలయంలో 2016, ఫిబ్రవరి-18వ తేదీ గురువారంనాడు, స్వామివారికి ఎదురుగా పంచలోహ నందీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గుడివాడ పట్టణానికి చెందిన శ్రీ రెడ్డి లోకేశ్వరరావు, భాగ్యవతి దంపతులు, ఈ విగ్రహాన్ని ఆలయానికి బహూకరించారు. 

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం...
స్థానిక బంటుమిల్లి రహదారిలోని ఈ ఆలయములో, ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి సందర్భంగా మూడురోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించెదరు. రెండవరోజున స్వామివారు చతుర్భుజ ఆంజనేయస్వామిగా దర్శనమిచ్చెదరు. మూడవరోజున హనుమజ్జయంతినాడు, స్వామివారు పంచముఖాంజనేయస్వామిగా దర్శనమిచ్చెదరు. ఈ మూడురోజులూ ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించెదరు. 

శ్రీ శంకరమందిరం ...
ఈ మందిరం స్థానిక బంటుమిల్లి రహదారిలోని ఉంది.

శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం ...
ఈ ఆలయ 16వ వార్షికోత్సవాలు, 2015, మే నెల-9,10 తేదీలలో వైభవంగా నిర్వహించారు. రెండవరోజైన ఆదివారంనాడు, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. 

శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానం..
ఈ ఆలయం గుడివాడ పట్టణంలోని నాలుగవ వార్డులో ఉంది.

శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం...
ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017, మార్చి-13వతేదీ సోమవారంనాడు, ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, శాంతికళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు నగరోత్సవం నిర్వహించెదరు. 

శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం
ఈ ఆలయం స్థానిక నీలామహల్ రహదారిలో ఉంది.

మూడు ఉపాలయాల సముదాయం 
శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానానికి చెందిన స్థలంలో, కేవలం దాతల ఆర్థిక సహకారంతో, ఒక కోటిన్నర రూపాయల అంచనా వ్యయంతో, ఒకే ప్రాంగణంలో, నూతనంగా ఈ ఆలయాలు రూపుదిద్దుకున్నవి. ఈ ఆలయాలలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015, జూన్-4వ తేదీ గురువారంనాడు ప్రారంభించారు. 5వ తేదీ శుక్రవారంనాడు, భక్తులు సమస్త దేవతార్చన పూజలను వైభవంగా నిర్వహించారు. 7వ తెదీ ఆదివారంనాడు, మేళతాళాలు, వేదపండితుల మంరోచ్ఛారణల మధ్య, విగ్రహ, శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న శివాలయంలో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదపండితులు ఉదయం నుండి, ప్రత్యేకపూజలు నిర్వహించి, ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చి, స్వామివారిని దర్శించుకొని, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద యెత్తున అన్నసమారాధన నిర్వహించారు. 

శ్రీ బాలకనకదుర్గాదేవి ఆలయం ..
శ్రీరాంపురంలోని ఈ ఆలయంలో శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ బాలకనకదుర్గాదేవి వారల విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, 2016, ఫిబ్రవరి-25వ తేదీ గురువారంనాడు ప్రారంభమైనవి. 26వ తేదీ శుక్రవారం ఉదయం 108 కలశాలతో అమ్మవారికి అభిషేకాలు, అమ్మవారి ప్రతిష్ఠా మహోత్సవం, పూర్ణాహుతి, శాంతికళ్యాణం మొదలగు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు.

శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ అనంత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం
ఈ ఆలయం బిళ్లపాడులో ఉంది
శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం 
శ్రీ బాలబావి గణపతి స్వామివారి ఆలయం 
ఈ ఆలయం స్థానిక 9వ వార్డులోని కఠారి రంగనాయకమ్మ వీధిలో ఉంది.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం
స్థానిక పామర్రు రహదారిలోని ఈ ఆలయ 19వ వార్షికోత్సవంగా 2015, డిసెంబరు-24వ తేదీ గురువారంనాడు, ఆలయంలోని బాబాకు 108 కలశాలతో క్షీరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, సాయి నక్షత్రమాలిక పఠనం నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. 

భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం 
ఈ ఆశ్రమం కార్మికనగర్ లో, రామాలయం వెనుకనున్నది. ఈ ఆశ్రమంలో స్వామివారి 33వ ఆరాధనోత్సవాలు, 2015, ఆగష్టు-23,24తేదీలలో వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

ఈ అశ్రమ మందిర నిర్మాణంలో భాగంగా, దాతల ఆర్థిక సహకారంతో నిర్మించనున్న గోపుర నిర్మాణానికి, 2015, నవంబరు-21వ తేదీ శనివారంనాడు, శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2016, ఫిబ్రవరిలో నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. శ్రీ జల్లా సుబ్బారావు, ఈ గోపుర నిర్మాణ శిల్పి. 

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం..
స్వామివారి 45వ ఆరాధనామహోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ ఆలయంలో 2016, మే-7వ తేదీ శనివారంనాడు, ఆలయంలో ఉత్సవాలను ప్రారంభించారు.

ప్రణవాశ్రమం 
శ్రీ పార్శ్వనాథస్వామివారి ఆలయం ..
గుడివాడ పట్టణంలోని మార్వాడి గుడి రహదారిపై ఉన్న ఈ ఆలయంలో, పర్వాపజుషన్ పర్వదినాన్ని పురస్కరించుకొని, మార్వాడీలు, 2017, ఆగష్టు-19 నుండి 27 వరకు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఈ 9 రోజులూ ఉపవాస దీక్షలు పాటించారు. 9వ రోజూ మరియూ ఆఖరి రోజైన 27వతేదీ ఆదివారంనాడు, 18 రకాల పూజా సామాగ్రితో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. 

శాసనసభ నియోజకవర్గం...
 గుడివాడ శాసనసభ నియోజకవర్గ ము ఉన్నది.
 


శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు

అట్లూరి పూర్ణచంద్రరావు
సినీ నిర్మాత, కమ్యూనిస్టు నాయులు.
జీవిత విశేషాలు
 వీరు కృష్ణాజిల్లా, గుడివాడ మండలం, చౌటుపల్లి గ్రామంలో 1925వ సంవత్సరం ఏప్రిల్ 4న జన్మించారు.. వీరికి చదువు పెద్దగా అబ్బలేదు. ఎస్.ఎస్.సి ఫెయిల్ అయిన తర్వాత ఇంటి నుండి పారిపోయి విజయవాడలో ఒక కాంట్రాక్టర్ వద్ద మూడు నెలలు పనిచేశారు. తర్వాత గుడివాడలోని గౌరీశంకర్ టాకీసులో ప్రొజెక్టర్ ఆపరేటింగ్ అసస్టెంట్‌గా, బుకింగ్ క్లర్క్‌గా ఆరు నెలలు పనిచేశారు.. తర్వాత విజయవాడలోని నవయుగ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలో ఐదు సంవత్సరాలు పనిచేశారు.. అదే సంస్థ గుంతకల్లు బ్రాంచి మేనేజరుగా కొంతకాలం పనిచేశారు. తర్వాత మద్రాసుకు వెళ్లి బి.విఠలాచార్య, పి.పుల్లయ్యల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు.. తర్వాత మిత్రుల సలహాతో ప్రొడక్షన్ రంగంలోకి ప్రవేశించారు. సినిమాలలో ప్రొడక్షన్ అసిస్టెంటుగా నాలుగు సంవత్సరాలు పనిచేసి మెళకువలు నేర్చుకున్నారు..

సినీ నిర్మాణ రంగంలో 
వీరు 1964లో మొట్టమొదటగా అగ్గిమీద గుగ్గిలం చిత్రాన్ని ప్రారంభించారు. నవభారత్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్.ప్రకాశరావు 50వేలు పెట్టుబడి పెట్టారు. ఈ చిత్రం ప్రారంభం నుండి చివరివరకు పూర్ణచంద్రరావు చూసుకున్నా నిర్మాతగా వీరి పేరు మొదటి ఐదు సినిమాలలో వేసుకోలేదు. ఇతడు తెలుగులో 35 సినిమాలు, హిందీలో 18 సినిమాలు, తమిళంలో 13 సినిమాలు, కన్నడ, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషలలో రెండేసి చిత్రాలు, భోజ్‌పురిలో ఒక చిత్రం నిర్మించారు.

శరత్ బాబును సినీ నటుడిగా పరిచయం చేశారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రిని సినీ సంభాషణల రచయితగా వెండితెరకు పరిచయం చేశారు.

సినిమాల జాబితా  ..
అగ్గిమీద గుగ్గిలం
అపాయంలో ఉపాయం
ఉక్కుపిడుగు
గజదొంగ గంగన్న
మాతృదేవత
రైతు కుటుంబం
రౌడీరాణి
పాపం పసివాడు
ప్రేమ పుస్తకం
వెంకీ
లోక్ పరలోక్ (హిందీ)
మాంగ్ భరో సజనా (హిందీ)
ఏక్ హీ భూల్ (హిందీ)
అంధాకానూన్ (హిందీ)
ఆఖరీరాస్తా (హిందీ)
చాల్‌భాజ్ (హిందీ)
దిల్ (తమిళ)
యూత్ (తమిళ)
ఇడియట్ (హిందీ)

కొంతకాలం కాలేయ క్యాన్సర్ తో బాధపడుతూ 2017, అక్టోబరు 29 న హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. వీరి  భార్య పేరు మరుద్వతి. వీరికి ఇరువురు కుమారులు ఉన్నారు.

శ్రీ కామినేని ఈశ్వరరావు...

 అర్జున అవార్డ్ గ్రహీత.. వైట్ లిఫ్టర్ కామినేని ఈశ్వరరావు...
 జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో, కృష్ణా జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్ళిన ఘనత, అర్జున అవార్డు గ్రహీత శ్రీ కామినేని ఈశ్వరరావు గారికే దక్కుతుంది. భారతదేశంలోని అనేక నగరాలలో, భారత వెట్ లిఫ్టింగ్ ఫెడెరేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో 9 పసిడి పతకాలూ, భారతదేశంలో 12 జాతీయ రికార్డులను సాధించిన మొదటి భారతీయుడు శ్రీ ఈశ్వరరావు కావటం విశేషం...
వీరు గుడివాడ దగ్గర భట్ల పెనుమర్రు... గ్రామంలో 1926, ఆగస్టు-28వ తేదీన ఒక రైతు కుటుంబంలో జన్మించారు. వెయిట్ లిఫ్టింగ్ లో గోసాలలోని గురువు శ్రీ రంగదాసుగారి వద్ద, శిక్షణ పొందినారు. జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో కోల్ కతా, చెన్నై, ముంబై, కొత్త డిల్లీ, జబల్ పూర్ మొదలగు నగరాలతో పాటు, విదేశాలలోని హెల్సింకీ (ఫిన్లెండు), వార్సా (పోలెండ్), మెల్బోర్న్ (ఆస్ట్రేలియా), జకార్తా (ఇండోనేషియా) మొదలగు చోట్ల జరిగిన పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచారు. 1951లో కోల్ కతాలో జరిగిన అన్ని విభాగాలలోనూ, శరీర సౌష్టవ పోటీలలోనూ, పసిడి పతకాలు సాధించారు. 1963లో అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా "అర్జున" అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా నిలిచారు.
ఎన్నో రికార్డులు:- 1951లో ఆసియా క్రీడలలో, ఇంతవరకూ ఏ భారతీయుడూ సాధించని రజత పతకాన్ని ఈయన వెయిట్ లిఫ్టింగులో సాధించారు. దేశంలో 12 జాతీయ రికార్డులు, ఆసియా ఖండంలో 4 రికార్డులు స్థాపించిన తొలి భారతీయుడు. ఈయన కృష్ణా జిల్లా క్రీడా సంఘానికి కార్యదర్శిగా పనిచేశినారు. వీరికి చలనచిత్ర రంగంలో గూడా ప్రవేశం ఉంది. "భీమాంజనేయ యుద్ధం" అను చిత్రంలో వీరి ప్రత్యర్థి శ్రీ దండమూడి రాజగోపాలరావుతో పోటీగా ఆంజనేయ పాత్ర ధరించి పలువురు ప్రశంసలు పొందినారు. వీరు 1977, నవంబరు-7న గుండెపోటుతో కన్నుమూశారు.
కుటుంబ నేపథ్యం:- వీరి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ కె.పిరావు, హాంగ్ కాంగ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. కుమార్తె శ్రీమతి వసుంధర, విజయవాడలో గృహిణిగా ఉన్నారు.
యోధానుయోధులు:- గతంలో ఆంధ్రప్రదేశ్ లో, వెయిట్ లిఫ్టింగ్ అంటే కృష్ణాజిల్లా నే గుర్తుకు వచ్చేది. జిల్లాకు చెందిన శ్రీ కామినేని ఈశ్వరరావు, శ్రీ దండమూడి రాజగోపాలరావు వంటి యోధానుయోధులు, జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకొని వచ్చారు. వీరితోపాటు బొబ్బా వెంకటేశ్వరరావు, ఎం.పి.రంగా, మాదు వెంకటేశ్వరరావు, సంపత్, రామస్వామి, అచ్యుతరావు వంటి ఎందరో వెయిట్ లిఫ్టర్లు 1945-70 మధ్య జిల్లాకు మంచిపేరు తీసుకొని వచ్చారు.

శ్రీ పామర్తి సుబ్బారావు


శ్రీ పామర్తి సుబ్బారావు గారు (సెప్టెంబర్ 8, 1922 - జనవరి 28, 2004)  గుడివాడ..
నాటి ప్రముఖ రంగస్థల నటులు దర్శకులు, క్రీడాకారులు.

సుబ్బారావుగారు 1922, సెప్టెంబర్ 8న శ్రీరాములు, మాణిక్యాంబ దంపతులకు గుడివాడలో జన్మించారు

రంగస్థల ప్రస్థానం 
చిన్నప్పటి నుంచి నాటక ప్రదర్శనల పట్ల ఆసక్తివున్న సుబ్బారావు గారు తన సహచరులైన సూరపనేని ప్రభాకరరావు, హెచ్.వి. చలపతిరావు, దాసరి తిలకం, పువ్వుల అనసూయ మొదలైన వారితో కలిసి నాటకాలు వేయడం ప్రారంభించారు..నట సామ్రాట్ అక్కినేని సహాధ్యాయి...మిత్రులు..
 తన బృందంతో 'తెలుగుతల్లి' నాటకాన్ని విస్తృతంగా ప్రదర్శించారు. 1939లో తెలుగుతల్లి నాటకాన్ని విజయవాడలో ప్రదర్శించినప్పడు తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి ముగ్ధులై పామర్తికి 'హాస్యరత్న' బిరుదు ప్రదానం చేసి ఆశీర్వదించారు. ‘పల్లెపడుచు'లో గంగులు పాత్ర 'సుల్తానీ'లో పరమానందం, 'ఎవరు దొంగ'లో దొంగ వంటి పాత్రలే పోషించారు.

బొబ్బిలియుద్ధం, సత్యహరిశ్చంద్రీయం, మహాకవి కాళిదాసు, చంద్రగుప్త, రంగూన్ రౌడీ మొదలైన పద్య నాటకాలను ప్రదర్శించారు. శ్రీ ప్రభాకర నాట్యమండలి సంస్థ పేర అనేక ప్రదర్శనలు ఇచ్చారు. పినిశెట్టి శ్రీరామమూర్తి రచించిన 'పల్లెపడుచు' నాటకంలో గంగులు పాత్ర అద్భుతంగా పోషించేవారు. 1951లో తెనాలిలో జరిగిన పోటీలలో ఆత్రేయ రచించిన ఎవరు దొంగ నాటికను ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనకు, నటనకు బహుమతులందుకున్నారు. ప్రముఖ కళాకారులైన కైకాల సత్యనారాయణ, పుష్పకుమారి, రేడియో ఏకాంబరం, జాలాది రాజారావు, జి.వి. ప్రసాదరావు, నిర్మలమ్మ, హేమలత, అమ్ముల పార్వతి మొదలైనవారు పామర్తి శిక్షణలో నటనను నేర్చుకున్నారు. పామర్తి దర్శకత్వం వహించిన ఆరు స్త్రీ పాత్రలున్న 'చావకూడదు' నాటిక ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటక పోటీలో ఉత్తమ నటి, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతులను అందుకుంది.

వేలూరి శివరామ శాస్త్రి రచించిన రేడియో నాటికను ప్రదర్శనకు అనుగుణంగా రాసి, అందులో పరమానందం పాత్రలో నటించాడు. 1961లో నాటక కళాపరిషత్తులో 'సుల్తానీ' నాటికను మనోజ్ఞంగా ప్రదర్శించడం, దానికి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకత్వం బహుమతులు గెలుచుకోవడం జరిగింది. సుల్తానీ పామర్తి నట జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది.

సన్మానాలు – పురస్కారాలు సవరించు
1991లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంల 'గౌరవ పురస్కారం'
1993లో అక్కినేని కళాపీఠం పురస్కారం
1994లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు పురస్కారం
1997లో అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారం
1997లో కళాజగతి రంగస్థల పురస్కారం
1999లో శ్రీకళానికేతన్ (హైదరాబాద్) జూలూరి వీరేశలింగం కల్చరల్ అవార్డు
గుర్తింపులు సవరించు
గుడివాడలో సుబ్బారావు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించండమేకాకుండా, పామర్తి నివసించిన వీధికి 'పామర్తి సుబ్బారావుగారి వీధి' అని నామకరణం చేశారు.
సుబ్బారావు 2004, జనవరి 28న దివంగతులయ్యారు..

శ్రీ. వీ.యస్.ఆర్. స్వామి

శ్రీ  వి.ఆర్. స్వామి ప్రముఖ కెమెరామెన్
 100 సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు.
కృష్ణా జిల్లా, గుడివాడ మండలం, వలివర్తిపాడు గ్రామంలో జూలై 15 1935 న జన్మించారు. ఈయనకు చిన్నప్పటి నుండి ఫోటోగ్రఫీపైన మక్కువ ఎక్కువ.ఈయన తన గురువైన సి.నాగేశ్వరరావు వద్ద ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు అయిన రవికాంత్ మెగా, ఎస్.శంకర్ ల దగ్గర పనిచేశారు. వీరాభిమన్యు, బందిపోటు చిత్రాలకు కెమెరా ఆపరేటర్‌గా పనిచేశారు. కృష్ణ నటించిన అసాధ్యుడు చిత్రంతో మొదటి సారిగా ఇతడు ఛాయాగ్రాహకుడయ్యారు. ఈయన సినిమాటోగ్రఫీలో ఎన్నో ప్రయోగాలు చేశారు. తెలుగులో అగ్రనటుల చిత్రాలకు ఎక్కువగా ఛాయాగ్రాహకుడిగా పనిచేసింది ఈయనే. 1986లో నిర్మింపబడిన తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా సింహాసనంకు ఈయనే ఛాయాగ్రాహకుడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు ఎం.వి.రఘు, ఎస్. గోపాలరెడ్డి, రాం ప్రసాద్ లు ఇతని శిష్యులే.

వెండితెరపై అద్భుతాలు సవరించు
మోసగాళ్ళకు మోసగాడు సినిమా క్లైమాక్స్ తీస్తున్నారు. హీరో కృష్ణ, విలన్ని గట్టిగా గూబమీద కొట్టాలి. ఆ దెబ్బకి అతనికి లోకమంతా గిర్రున తిరిగే ఎఫెక్టు రావాలి. ఈ నన్నివేశం ఎలా తీయాలి?. అందరూ టెన్షన్ పడుతున్నారు గానీ, కెమెరామన్ మాత్రం తాపీగా ఆలోచిసూ కూర్చున్నారు. కాసేపటి తర్వాత లారీ టైర్ తెమ్మని పురమాయించారు. దాన్ని తాడుతో వేలాడదీశారు. "ఈ లారీటైర్తో ఈయనగారు ఏం చేస్తారా" అని యూనిట్ అంతా వళ్లంతా కళ్ళు చేసు కుని మరీ చూస్తుంటే, ఆ కెమెరామన్ తన కెమెరాతో సహా ఆ లారీటైర్లో కూర్చుని దాన్ని గిర్రున తిప్పమని ఆదేశించారు. అలా టైర్లో గిర్రున తిరుగుతూ ఆ సీన్ షూట్ చేశారు. ఆ కాలంలో యిప్పటిలా క్రేనులూ, గ్రాఫిక్సూ లేనప్పటికీ కేవలం తన బుర్రతోనే కెమెరా కు పని చెప్పి వెండితెరపై వండర్స్ చేశారు. ఆయన ఛాయాగ్రహణ శాఖలో పూనా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి వచ్చిన తొలి బృందంలో ఒకరు. రవికాంత్ నగాయిచ్ లాంటి మహామహుల దగ్గర శిష్య రికం చేసిన స్వామి అసాధ్యుడు(1985)తో కెమెరామన్ గా మారారు తెలుగు సినిమాని సాంకేతికంగా కీలక మైన మలుపు తిప్పిన ఆయన. కలర్, సినిమా స్కోప్, 70 ఎం.ఎం. వంటి ప్రక్రియల్లో తొలినాళ్లలోనే ప్రయో గాలకు శ్రీకారం చుట్టారు. 250 పైగా సినిమాలకు ఛాయాగ్రహణం సమకూర్చారు. మలయాళం మినహా దాదాపు అన్ని భాషల్లోనూ చక్రం (కెమెరా) తిప్పారు. ఆయన ఖాతాలో ఎన్నో విలువైన చిత్రాలు ఉన్నాయి.

హిందీలో 'మహాశక్తిమాన్' అనే త్రీడీ చిత్రం, తెలుగులో ఆపద్బాంధవులు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఎదురీత, కలియుగ స్త్రీ అనే సినిమాలను నిర్మించారు. నేటి ప్రసిద్ధ ఛాయాగ్రాహకులు ఎస్.గోపాల్రెడ్డి, ఎమ్వీ రఘు, శరత్, తదితరులు ఈయన దగ్గర శిష్యరికం చేసిన వారే. కెమెరామన్ గా ఆయన చివరి చిత్రం ప్రభాస్ నటించిన 'అడవి రాముడు.
ఛాయాగ్రాహకుడిగా
====తెలుగు====
అసాధ్యుడు (1968)
కథానాయకుడు (1969)
మోసగాళ్ళకు మోసగాడు (1971)
భలే మోసగాడు (1972)
అందాల రాముడు (1973)
దేవుడు చేసిన మనుషులు (1973)
మంచివాళ్లకు మంచివాడు (1973)
అల్లూరి సీతారామరాజు (1974)
భక్త కన్నప్ప (1976)
సిరిసిరిమువ్వ (1976)
ఎదురీత (1977)
విచిత్ర జీవితం (1978)
యువరాజు (1982)
ఖైదీ (1983)
చట్టంతో పోరాటం (1985)
వేట (1986)
సింహాసనం (1986)
ఆదిత్య 369 (1991)
చినరాయుడు (1992)
ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
రౌడీ ఇన్‌స్పెక్టర్ (1992)
సమరసింహారెడ్డి (1999)
నరసింహ నాయుడు (2001)
భలేవాడివి బాసు (2001)
ఇంద్ర (2002)
కొండవీటి సింహాసనం (2002)
అనగనగా ఓ కుర్రాడు (2003)
అడవి రాముడు (2004)
లక్ష్మీనరసింహా (2004)
విజయేంద్ర వర్మ (2004)
ఒక్క మగాడు (2008)
హిందీ
ఇత్నీ సీ బాత్ (1981)
పాతాళ్ భైరవి (1985)
సింఘాసన్ (1986)
దోస్త్ (1989)
దర్శకుడిగా 
మహా శక్తిమాన్ (1985)
పురస్కారాలు 
1987లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా విశ్వనాధ నాయకుడు చిత్రానికి తామ్ర నంది పురస్కారం.
నాలుగు దశాబ్దాల పాటు ఛాయాగ్రాహకుడిగా సుదీర్ఘ ప్రయాణం చేసి, ఎన్నో అజరామరమైన చిత్రాలకు తన కెమెరాతో నగిషీలద్దిన మేటి కెమెరామన్ వీయస్ఆర్ స్వామి 2008,నవంబరు 11న మచిలీపట్నంలో గుండెపోటుతో మరణించారు. మరణించే సమయానికి వీరి వయసు 73 సంవత్సరాలు.

శ్రీ ఎస్. వి.రామారావు గారు

శ్రీ.ఎస్. వి.రామారావు గారు (సిరందాసు వెంకట )  
భారత సంతతికి చెందిన బ్రిటిష్ చిత్రకారుడు. ఆయన క్యూబిస్ట్ చిత్రకళలో ప్రావీణ్యుడు.ఆయన 1962లో కామన్వెల్త్ ఫెలోషిప్ పొందాడు. భారత ప్రభుత్వం ఆయనకు దేశంలోని నాల్గవ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ తో గౌరవించింది..
ఆయన తండ్రి చెక్కతో శిల్పాలు చేసేవాడు. తరువాత ఆయన నిర్మాణ పని చేసేవాడు.రావు గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్టం లోని కృష్ణా జిల్లా గుడివాడ లో 1936లో జన్మించారు. ఆయన అకౌంటింగ్, బ్యాంకిగ్ లలో 1955లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టాను పొందారు. ఆ కాలంలో కె.వేణుగోపాల్ వద్ద శిక్షణ పొందాడుతరువాత కె.శ్రీనివాసులు గారి వద్ద శిక్షణ పొంది 1955లో ఫైన్ ఆర్ట్స్ నందు ప్రభుత్వ డిప్లొమాను చెన్నైలోని కళాక్షేత్రం నుండి పొందాడు
 తరువాత శిక్షణ కోసం ఆయన మద్రాసు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ (ప్రస్తుతం ప్రభుత్వం కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్,చిన్నై) చేరాడు. 1959లో ఆయన ఫైన్ ఆర్ట్స్ డిగ్రీని పొందాడుఅదే విధంగా ఆయన ఎకనమిక్స్ ను అభ్యసించి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని పొందాడు.

ఆయన చెన్నైలో ప్రసిద్ధ చిత్రకారుడు అయిన కె.సి.ఎస్.పణికేర్ తో కలసి పనిచేసాడు. ఆయన 1959లో న్యూఢిల్లీ వెళ్ళాడు. అచట భారత ప్రభుత్వ రీసెర్చ్ ఫెలోషిప్ పొంది 1962 వరకు అక్కడ ఉన్నాడు ఆ సంవత్సరం ఆయన కామన్వెల్త్ ఫెలోషిప్ పొందాడు తరువాత ఆయాన్ యునైటెడ్ కింగ్ డం కు వెళ్ళి  అచట స్లాడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, యూనివర్శిటీ ఆఫ్ లండన్ లలో 1965 వరకు విలియం కోల్డ్‌స్ట్రీమ్‌ అద్వర్యంలో చదివాడు. తరువాత రెండు సంవత్సరాలు ఆయన లండన్ కంట్రీ కౌన్సిల్ లో పెయింటింగ్, డ్రాయింగ్ ఉపాధ్యాయునిగా పనిచేసాడు. తరువాత 1967లో యు.ఎస్ వెళ్ళి 1969లో చిన్‌సిన్నాటి విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.అచట ఆయన టీచింగ్ అసిస్టెంటుగా 1969 వరకు పనిచేసాడు. తరువాత వెస్టెర్న్ కెంటుకీ విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ప్రొఫెసరుగా పనిచేసాడు.తరువాత ఆయన చిగాగో వెళ్లాడు.

లండన్ లోని టాటా గ్యాలరీ, న్యూయార్క్ లోని మెట్రొపోలియన్ మ్యూసియం ఆర్ట్స్ నందు ఆయన చిత్రించిన చిత్రాలను చేడవచ్చు.ప్రపంచంలో అనేక ఆర్ట్ గ్యాలరీలలో,మ్యూజియం లలో ఆయన చిత్రాలు ఉన్నాయి.

ఆయన చిత్రకళ, కవిత్వం పరంగా ప్రసిద్దుడు. ఆయన సుగుణ ను వివాహమాడాడు. వారికి ఒక కుమార్తె(పద్మావతి) జన్మించింది. ఆమె భరతనాట్యంలో సుపరిచితురాలు 

అవార్డులు, గుర్తింపులు సవరించు
లార్డ్ క్రాప్ట్ అవార్దు - 
కామన్వెల్త్ లో ప్రతిభావంతుడైన కళాకారునిగా గుర్తింపు
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్.
ఆయన జీవిత చరిత్ర అమెరికా, వాషింగ్‌టన్ లలో ప్రతిభావంతులైన విద్యావేత్తలుగా గుర్తింపబడినది.రచ్చ గెలిచినా ఇల్లు గుర్తించని గొప్ప చిత్రకారులు...

శ్రీ దుక్కిపాటి మధుసూదనరావు

శ్రీ దుక్కిపాటి మధుసూదనరావు గారు సీతారామ స్వామి, గంగాజలం దంపతులకు 17 జూలై, 1917 తేదీన కృష్ణా జిల్లా గుడివాడ తాలూకులోని పెయ్యేరు గ్రామంలో జనించారు. చిన్నతనంలో కన్నతల్లి కనుమూయడంతో సవతితల్లి పెంచి పెద్దచేశారు. ఆమె కన్నతల్లి ప్రేమ ఎరుగని దుక్కిపాటిని లాలించి, బుజ్జగించి, తీర్చి, ప్రయోజకుడిని చేశారు. అందుకే ఆయన ఆ తల్లిని మరచిపోలేకపోయాను. చదువుకోవలసిన వయసులో తండ్రి అనారోగ్యంతో మంచం పట్టడంతో చదువు మానక తప్పిందికాదు. చదవుమాని వ్యవసాయం పనులు చేశారు. అలా కొన్నాళ్లకి వ్యవసాయం ఒకదారికి రాగానే దుక్కిపాటి మళ్లీ చదువుపై దృష్టి సారించారు. నోబుల్‌ కళాశాలలో చేరారు. అక్కడ ఆయన చక్కని కార్యకర్తగా ఎదగడానికి పరిస్థితులు ప్రేరేపించాయి. కళాశాలలో 'డ్రమెటిక్‌ అసోసియేషన్‌' ఎన్నికల్లో నిలిచి దానికి కార్యదర్శి అయ్యారు. ఆ కాలంలో ఆయన ఎన్నో నాటికలు విద్యార్థులచేత ప్రదర్శింపచేశారు. అలా ఆయన విద్యార్థి దశనుంచే అనుభవం గడించారు. చదువు పూర్తయ్యాక ఎక్సెల్సియల్‌ క్లబ్బు అనే నాటక సంస్థను ప్రారంభించారు. దానికి కార్యదర్శి అయ్యారు. కోడూరి అచ్చయ్య, ఎం.ఆర్‌.అప్పారావు వంటి మిత్రులతో కలసి ఆ క్లబ్బు పక్షాన నాటకాలు విరివిగా ప్రదర్శించారు. మధుసూదనరావు తెచ్చిన సంస్కరణలే ఆయనకు పేరు తెచ్చాయి. ఆ కాలంలో పౌరాణిక నాటకాలకే ఆదరణ. వాటి ఆధిపత్యాన్ని తగ్గించాలనుకొన్న దుక్కిపాటి సాంఘిక నాటకాల రూపకల్పనకు నడుం బిగించారు. ఎక్సెల్సియల్‌ క్లబ్లులో దుక్కిపాటితోపాటు పెండ్యాల, బుద్ధిరాజు శ్రీరామమూర్తి వంటివారూ ఉండేవారు. వారి సహకారంతో ఆయన ఆశాజ్యోతి, సత్యాన్వేషణ, తెలుగుతల్లి వంటి సాంఘిక నాటకాలను రాయించి చేపట్టారు. అవి ఘనవిజయాలన్ని సాధించాయి! ఆ తరుణంలోనే దుక్కిపాటికి అక్కినేనితో పరిచయం కలిగింది.

అప్పటికే అక్కినేని ధర్మపత్ని చిత్రంలో నటించి వెనక్కి వచ్చేశారు. బుద్ధిరాజు శ్రీరామమూర్తి సలహాతో 'విప్రనారాయణ' నాటకంలో దేవదేవి పాత్ర పోషిస్తున్నారు. ఆ నాటక ప్రదర్శన చూసిన దుక్కిపాటి, తమకు కథానాయిక/స్త్రీ పాత్ర లేని లోటు తీరిందని అక్కినేనిని హీరోయిన్ని చేశారు. అలా వారంతా నాటకాల్లో బిజీగా ఉన్నప్పుడే ఘంటసాల బలరామయ్య ఓ రైల్వేస్టేషన్లో అక్కినేనిని చూసి తన సినిమాకు ఆయనే తగిన వ్యక్తి అని నిర్ధారించుకొని చిరునామా తీసుకొన్నారు. తర్వాత గుడివాడకు వచ్చి అక్కినేనికి కబురు చేశారు. దుక్కిపాటి, రామబ్రహ్మం (అక్కినేని సోదరుడు) ఇద్దరూ అక్కినేనిని ఘంటసాల బలరామయ్య వద్దకు తీసుకెళ్లారు. ఆయన వారిని మద్రాసుకొచ్చి 'ప్రతిభ' ఆఫీసులో సంప్రదించమన్నారు. అంతే దుక్కిపాటి, మరో మిత్రుడు సూర్యప్రకాశరావుతో కలసి అక్కినేనిని తీసుకొని మద్రాసు సెంట్రల్‌ స్టేషనల్లో దిగారు. 'ప్రతిభ' ఆఫీసులో పేకేటి అక్కినేనని స్వాగతించారు. అలా 'సీతారామజననంలో అక్కినేని హీరో అయ్యారు. ఆ తర్వాత దుక్కిపాటి బలరామయ్య, చల్లపల్లి రాజాలతో కలసి గూడవల్లి రామబ్రహ్మం దగ్గరకెళ్లి అక్కినేనిని 'మాయాలోకం'లో చిత్రానికి తీసుకొమ్మని సూచించారు. అలా 'మాయాలోకం', తర్వాత శరబందిరాజు వింటి చిత్రాల్లో అక్కినేని నటించి నటుడిగా నిలదొక్కుకొన్నారు. దాదాపు అదే తరుణంలో దుక్కిపాటి మధుసూదనరావు తనని అమ్మకన్నా మిన్నగా పెంచి పోషించిన సవతితల్లి అన్నపూర్ణ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దానికి అక్కినేని నాగేశ్వరరావుని ఛైర్మన్‌ని చేశారు. ఆ సంస్థ ద్వారా తొలిసారి దొంగరాముడు చిత్రం నిర్మించారు. కె.వి.రెడ్డి దర్శకత్వంలో అక్కినేని, సావిత్రల జంట కన్నుల పండువుగా నటించడంతో అది ఘనవిజయం సాధించింది. దుక్కిపాటి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తోడికోడళ్ళు, మాంగల్యబలం, వెలుగునీడలు, చదువుకున్న అమ్మాయిలు, ఇద్దరు మిత్రులు, డాక్టర్‌ చక్రవర్తి, ఆత్మ గౌరవం, పూలరంగడు, విచిత్రబంధం, ప్రేమలేఖలు, రాధాకృష్ణ, పెళ్లీడు పిల్లలు, అమెరికా అబ్బాయి... వంటి అద్భుతమైన చిత్రాలెన్నో దుక్కిపాటి నిర్మించారు. డాక్టర్‌ చక్రవర్తి చిత్రం రాష్ట్రప్రభుత్వం నెలకొల్పిన తొలి నంది అవార్డును అందుకోవడం విశేషం. పెళ్లీడు పిల్లలు, అమెరికా అబ్బాయి తప్ప మిగిలిన చిత్రాలన్నీ ఘనవిజయం సాధించాయనడంలో సందేహం లేదు. తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన మొదటి సినిమాగా ఇద్దరు మిత్రులు. అన్నపూర్ణ సంస్థ నిర్మించే సినిమాలకు ఎక్కువగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించే వారు. దుక్కిపాటి తన సినిమాలలో కొర్రపాటి గంగాధరరావు, యుద్దనపూడి సులోచనరాణి, గొల్లపూడి మారుతీరావు, ముప్పాళ్ల రంగనాయకమ్మ (సంభాషణల రచయిత్రి), కె.విశ్వనాథ్ (దర్శకుడు), ఆశాలత కులకర్ణి, రామకృష్ణ, జీడిగుంట రామచంద్ర మూర్తి, శారద వంటి కళాకారులను పరిచయం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి రావడానికి అక్కినేనితోపాటు దుక్కిపాటి మధుసూదనరావు ఎంతో కృషి చేశారు. అందుకే ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డుతో రాష్ట్రప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. రెండు శరీరాల్లో ఉన్న ఒకే ఆత్మ స్నేహం అంటారు. దాన్ని దుక్కిపాటి, అక్కినేని- ఇద్దరూ నిరూపించారు
దుక్కిపాటిగారు న్యుమోనియా వ్యాధితో బాధపడూతూ 90 యేళ్ళ వయసులో 26 మార్చి, 2006 ఆదివారం రోజున మరణించారు

శ్రీ నందిరాజు నారాయణమూర్తి

శ్రీ నందిరాజు నారాయణమూర్తి  
ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు మరియు నాటక ప్రయోక్త.
నటనాచార్య, కళాతపస్వి, ఆంధ్రశివాజీ బిరుదాంకితులు.
★జననం - 
శ్రీ నారాయణమూర్తి 1934, జూలై 31 న వెంకట్రామయ్య, బాలా త్రిపురసుందరి దంపతులకు తెనాలి జన్మించాడు. బి.ఏ. పూర్తిచేశారు.

★వివాహం - ఉద్యోగం 
నారాయణముర్తి గారి మొదటి భార్య పేరు శ్రీమతి కుసుమ. ఆవిడ పరమపదించక సుప్రసిద్ద నాటక నటిమణి జ్యొతి గారిని వివాహం చేసుకున్నారు. ఆయనకు నలుగురు కొడుకులు. ఆయన వి.డి.ఓ.గా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఆయన ఉద్యోగంలో ఉంటూ, నాటక రంగంలో విశేష సేవలు అందించారు.

★నాటకరంగ ప్రస్థానం
శ్రీ నారాయణమూర్తి తన 12వ ఏట వీలునామా అనే హాస్యనాటికతో రంగస్థలంలోకి ప్రవేశించారు. ప్రసిద్ధ నటులు అబ్బూరి వరప్రసాదరావు, ముదిగొండ లింగమూర్తి ల సాహచర్యంతో అభినయంలో మెళకువలను నేర్చుకున్నారు. 1976లో అబ్బూరి కళా పరిషత్తు ప్రారంభించారు. కృష్ణాజిల్లా #గుడివాడ లో స్థిరనివాసం ఏర్పాటుచేసుకొని అనేక నాటకాలను ప్రదర్శించారు. సుమారు 70 నాటకాలకు దర్శకత్వం వహించిన నందిరాజు పౌరాణికాలలో ప్రతినాయక పాత్రలను ఏరి కోరి ఎంచుకుని వాటితోనే మంచి గుర్తింపును సాధించారు. నట దంపతులుగా నారాయణమూర్తి, జ్యోతిలు నాటకరంగానికి ఎనలేని సేవ చేశారు. సినిమాలో నటించమని అలనాటి ప్రముఖ చలన చిత్ర దర్శకులు ఆదుర్తి సుబ్బారావు కోరినా నాటకరంగంలో ఉండడానికే ఇష్టపడ్డారు. వేమూరి రామయ్య చుండూరు మధుసూదనరావు, ఎ.వి.సుబ్బారావు, ఆచంట వెంకటరత్నం నాయుడు, గుమ్మడి గోపాలకృష్ణ, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, బి.ఎన్. సూరి వంటి ప్రసిద్ధ నటులతో కలిసి నటించారు.
★నటించిన నాటకాలు 
వీలునామా
కులం లేని పిల్ల
కూలి పిల్ల
పునర్జన్మ
ఇన్స్ పెక్టర్ జనరల్
భయం
వీలునామా
బాలనాగమ్మ
రామదాసు
మోహినీ భస్మాసుర
సీతారామ కళ్యాణం
వారసత్వం
వెంకన్న కాపురం
పల్లెపడుచు
ఉద్యోగ విజయాలు
కురుక్షేత్రం
★నటించిన పాత్రలు
దుర్యోధనుడు
దుశ్శాసనుడు
రావణబ్రహ్మ
మైరావణుడు
హిరణ్యకశ్యపుడు

అనేక నాటక సమాజాలకు కార్యవర్గ సభ్యులుగా పనిచేసిన శ్రీ నందిరాజు 2006లో  పరమపదించారు..

శ్రీ నార్ల తాతారావు

దేశములో గల విద్యుత్నానిపుణులలో మేటి తాతారావు నార్ల....అయన అప్పాయింట్మెంట్ కొరకు అంతర్జాతీయప్రైవేటు కంపనీలు పడేవి.. బార్లా... .......
ఆయనేతాతారావు నార్ల....ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు, పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు బోర్డు మాజీ ఛైర్మన్.
నార్ల తాతారావు కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 1917 సెప్టెంబర్ నెల, 4వ తేదీన జన్మించారు. కౌతవరంలోనే ప్రాథమిక విద్యనభ్యసించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి 1941లో ఇంజినీరింగ్ పట్టా పొందారు. అమెరికా లోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎంఎస్‌ డిగ్రీ చదివిన తాతారావు మొదట టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో ఉద్యోగిగా జీవితము ప్రారంభించారు. పిదప ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్తు సంస్థ (ఏపీఎస్‌ఈబీ) డివిజనల్‌ ఇంజినీరుగా ఉద్యోగ జీవితం మొదలు పెట్టారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌ విద్యుత్తు బోర్డులో పనిచేసిన కాలంలో దేశంలోనే ఆ సంస్థను అగ్రగామిగా నిలిపారు. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల డిజైన్లను మార్చడంద్వారా ఈ రంగంలో పెద్ద విప్లవమే తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ డిజైన్లు దేశానికంతటికీ ఆదర్శమయ్యాయి. 1974 నుంచి 1988 వరకూ 14 ఏళ్లపాటు ఏపీఎస్‌ఈబీ ఛైర్మన్‌గా పనిచేసారు. విద్యుత్తు రంగానికి విశిష్ట సేవలందించినందుకుగాను 1983 లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది.
నాగార్జున సాగర్, శ్రీశైలం, దిగువ సీలేరు లలో విద్యుత్ ఉత్పాదక సామర్ధ్యము పెంచడంలో ప్రముఖ పాత్ర వహించారు.
రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడాన్ని నార్ల తాతారావు గట్టిగా సమర్థించారు.. పేదలకు తక్కువ ధరకే విద్యుత్తు అందజేయాలనేది ఆయన లక్ష్యం. విద్యుత్తుతో వ్యాపారం చేయవద్దనేది ఆయన నినాదం.
శ్రీ నార్ల తాతారావు 2007 ఏప్రిల్ 7 న హైదరాబాద్ నగరంలో గుండెపోటుతో మరణించారు.
 ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు తాతారావుకు సోదరుడు
డివిజనల్ ఇంజినీర్, మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖ కార్యదర్శి, విద్యుత్ బోర్డు, మధ్య ప్రదేశ్
ఛీఫ్ ఇంజినీర్, మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖ
ఛైర్మన్, మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖ
సభ్యుడు, కేంద్ర ప్రభుత్వ జల విద్యుత్ కమీషన్
ఛైర్మన్, సూపర్ ధర్మల్ పవర్ స్టేషన్స్ కమిటీ
ఛైర్మన్, ఎనర్జీ రీసర్చ్ శాఖ, భారత శాస్త్ర సాంకేతిక పరిశోధక పరిషత్
అధ్యక్షుడు, కేంద్రీయ జల విద్యుత్ సమితి
డైరెక్టర్, భారత అల్యూమినియమ్ కంపెనీ
అడ్వైజర్, బాంగ్లాదేశ్ పవర్ డెవలప్ మెంట్ బోర్డ్
ఓమ్ ప్రకాశ్ భాసిన్ పురస్కారము
పద్మ శ్రీ 1983
గౌరవ సభ్యుడు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అసోసియేషన్, అమెరికా
భారతరత్న, శ్రీ విశ్వేశ్వరయ్య అవార్డు 1985

శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు

 శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా..గుడివాడ తాలూకా ఎలకుర్రు గ్రామంలో 1867లో మే 1న జన్మించాడు. తల్లిదండ్రులు: శ్యామలాంబ, బుచ్చయ్య. స్వగ్రామంలోనూ, తరువాత మచిలీపట్నంలోనూ విద్యాభ్యాసం కొనసాగింది. 1891లో 'మద్రాసు క్రిస్టియన్ కాలేజి'లో పట్టభద్రుడయ్యాడు. ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం అతనుపై బడింది. వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం వ్యాసాలు కూడా అతనును ప్రభావితం చేశారు

నాగేశ్వరరావు కొద్దికాలం మద్రాసులోనూ, కలకత్తాలోనూ, బొంబాయిలోనూ ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించాడు. వ్యాపారంపైన ప్రత్యేక ఆసక్తితో 1893లో అమృతాంజన్ లిమిటెడ్ స్థాపించాడు. అతను స్వయంగా రూపొందించిన అమృతాంజనం అతి కొద్దికాలంలో అద్భుతమైన ప్రజాదరణ పొందింది.

1907లో సూరత్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత అతను తెలుగువారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించాడు. పత్రికా రంగంలో నాగేశ్వరరావు ప్రవేశం పాశ్చాత్య దేశాలలో పులిట్జర్ ప్రయత్నంతో పోల్చవచ్చును. అప్పుడే విస్తరిస్తున్న దేశీయ పత్రికలపై ఆంగ్లేయుల ప్రభుత్వం ధోరణి వ్యతిరేకంగా ఉండేది. కనుక దేశీయ పత్రికలు నడపడానికి ధైర్యము, అంకితభావం చాలా అవసరం.
సెప్టెంబరు 1908లో బొంబాయినుండి అతను ప్రారంభించిన ఆంధ్ర పత్రిక వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు వ్యాసాలు అతను సామాజిక చేతనా దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై అతను అవగాహననూ ప్రతిబింబించాయి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర పత్రిక దిన పత్రికను ప్రారంభించారు. 1914 ఏప్రిల్ 1న మద్రాసునుండి ఈ పత్రిక తొలిసారిగా వెలువడడం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణాధ్యాయం. 1924లో భారతి అనే సాంస్కృతిక, సాహితీ పత్రికను ప్రారంభించాడు. తెలుగు సాహితీప్రియులకు ఇది చాలాకాలం అభిమాన పత్రికగా నిలచింది.
మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి అరంభదశనుండి నాయకులుగా ఉన్నవారిలో నాగేశ్వరరావు ఒకడు. ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. ఈ విషయంలోనూ, తెలుగు భాష, సంస్కృతిలకు సంబంధించిన ఇతర విషయాలలోనూ అతను తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు అతనును దేశోధ్ధారక అని సత్కరించారు.
పత్రికా రంగంలోనే కాక ప్రచురణా రంగంలో కూడా నాగేశ్వరరావు తన కృషిని విస్తరించాడు. 1926లో 'ఆంధ్ర గ్రంథమాల' అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ 20 పైగా పుస్తకాలు ప్రచురించింది. వాటిలో 27 వ పుస్తకం, తిరుమల వెంకట రంగాచార్యులు సంకలనం చేసిన పారిభాషిక పదకోశము  ఇంకా అనేక ప్రాచీన గ్రంథాలను పునర్ముద్రించింది. సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఈ పుస్తకాల వెలను చాలా కొద్ది మొత్తంగా నిర్ణయించారు. తెలుగునాట గ్రంథాలయోద్యమానికి నాగేశ్వరరావును పితామహునిగా వర్ణించవచ్చును. కాలక్రమంగా 120 పైగా గ్రంథాలయాలు తెలుగునాట వెలశాయి.

టంగుటూరి ప్రకాశం సమకాలీనుడైన నాగేశ్వరరావు 1924 - 1934 మధ్యకాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఉన్నాడు. ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును, సహకారాన్ని అందించాడు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో అతను ఒకడు. నాగేశ్వరరావుపై ప్రజలకు ఎంతో అభిమానం, నమ్మకం ఉండేవి.
ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా 1931లో ఒక సంవత్సరం జైలులో ఉన్నపుడు నాగేశ్వరరావు భగవద్గీత గురించి వ్యాఖ్య వ్రాసాడు. గీత ఒక మతానికి పరిమితమైనది కాదనీ, దాని సందేశం సమస్తమానవాళికీ వర్తిస్తుందనీ అతను వివరించాడు.
నాగేశ్వరరావు అసమాణ దానశీలి. అతను ఇల్లు ఎప్పుడూ అతిధులతోనూ, అర్ధులతోనూ కళకళలాడుతుండేది. వివిధ సేవఅ కలాపాలకు ధారాళంగా అతను సహాయం చేస్తుండేవాడు. అతను ఇంటినుండి వట్టిచేతులతో ఎవరూ వెళ్ళేవారు కాదు. అతను దాతృత్వానికి అబ్బురపడి మహాత్మా గాంధీ అతనును విశ్వదాత అని కొనియాడాడు.
విజ్ఞానశాస్త్రములలో ఆసక్తి అతను ఆయారంగములో వివిధ పత్రికల ప్రచురణకు చేసిన విశేషకృషి వలన విదితం. ఇతను భారతి, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు, ఆంధ్ర గ్రంథమాల వంటి ప్రచురణలు, ఉగాది ప్రత్యేక సంచికలు వెలువరించాడు. ఆంధ్ర గ్రంథమాల ద్వారా అతను తెలుగు భాషలో అనేక భాషా, సాహితీ, విజ్ఞాన శాస్త్ర విషయాలపై గ్రంథాలను పరిచయం చేసి శాస్త్ర, సాహిత్య విజ్ఞానాభివృద్ధికి దోహదం చేశాడు. ఇతను బసవపురాణం, పడింతారాధ్య చరిత్ర, జీర్ణ విజయనగర చరిత్ర, తంజావూరాంధ్ర నాయకుల చరిత్ర మొదలగు పూర్వపు గ్రంథాలను, మాలపిల్ల, మహాత్మాగాంధీ ఆత్మకథ మున్నగు ఆధునిక గ్రంథాలనేం ప్రచురించాడు. ఇతను అనేక విషయాలపై వ్యాసాలు, అనేక గ్రంథాలకు పరిచయవాక్యాలు, ప్రవేశికలు కూడా రాశాడు. 1938లో కొమర్రాజు వెంకటలక్ష్మణరావు యొక్క ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము యొక్క మూడు సంపుటాలు ముద్రించాడు. తెలుగు నాటకరంగానికి కూడా అతను పలురకాల సేవలు చేశారు. తెలుగు నాటకం అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర నాటక కళా పరిషత్తును 1929లో స్థాపించిన నాటకరంగ ప్రముఖుల్లో అతను కూడా ఒకరు

కాశీనాథుని నాగేశ్వరరావు 1938లో మరణించాడు. తెలుగు జాతికీ, తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ అతను సేవ ఎనలేనిది. వీరు అల్లుడు శివలెంక శంభు ప్రసాద్ పంతులు గారి తదనంతరం ప్రముఖ పత్రికలు చాలా కాలం నడిపి అభివృద్ధి చేశారు.

శ్రీ కోడూరి అచ్చయ్య చౌదరి

శ్రీ కోడూరి అచ్చయ్య చౌదరి
వీరు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా ముదినేపల్లిలో జన్మించారు. చిన్నతనం నుండి నాటకాలంటే సరదా పడి తీవ్రంగా కృషిచేశారు. వీరు నాటకరంగంలో ప్రవేశించేముందు కృష్ణాజిల్లా బోర్డు రాజకీయాలలో తనమునకలవుతూ వుండేవారు. ముదినేపల్లి పంచాయతీ బోర్డు అధ్యక్షునిగా సుమారు పన్నెండు సంవత్సరాలు వ్యవహరించారు.ముదినేపల్లిలో ఎక్సెల్షియర్ క్లబ్బును స్థాపించి దాని ఆధ్వర్యాన మూడేండ్లపాటు చెడుగుడు, బ్యాడ్‌మింటన్ పోటీలు నిర్వహించారు. అయితే గ్రామ రాజకీయాలతో విసుగు చెంది ఆయన ఆ రంగం నుండి తప్పుకుని తన దృష్టిని నాటకరంగంవైపు మళ్ళింరు.
1939 ప్రాంతాలలో ఎక్సెల్షియర్ నాట్యమండలిని స్థాపించి తెలుగుతల్లి, ఆశాజ్యోతి, సత్యాన్వేషణం అనే సాంఘిక నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించి ఊరూరా ప్రదర్శింపచేశారు.ఈ నాటకాలలోనే నటసామ్రాట్ అక్కినేని బాల్యంలో నటించారు...అచ్చయ్య చౌదరిగారు అనేక షీల్డులు, ప్రశంసలు పొందారు. నిజానికి అచ్చయ్య గారికి బాల్యం నుండే నటునిగా పేరు పొందారు. తమ తొమ్మిదేళ్ల వయసులో వడాలి అగ్రహారం జగన్నాథస్వామి కళ్యాణోత్సవాలలో పెంజెండ్ర నాటక సమాజం వారు ప్రదర్శించిన కుశ లవ నాటకంలో రిహార్సల్ లేకనే లవుని పాత్రను అభినయించి సాటి నటబృందాన్ని ఆశ్చర్యచకితులను చేశారు. నాటక రచనలోని ప్రత్యక్షరం పూర్వాపరార్థాలు తెలుసుకుని పాత్ర స్వభావాన్ని అవగాహన చేసుకుని నాటకీయతలో పాత్రను సజీవంగా నిలపడం ఈయన ప్రత్యేకత. తాను స్థాపించిన ఎక్సెల్షియర్ నాట్యమండలిలో స్త్రీ పాత్రలు ధరించే అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగానికి వెళ్ళిపోవడంతో స్త్రీపాత్రలకు స్త్రీలను పెట్టుకుని నాటకాలాడడంలో వున్న సాధక బాధకాలను తట్టుకోలేమని భావించి ఆ నాట్యమండలినే రద్దు చేశారు. ఈయన కృష్ణాజిల్లా ప్రజా నాట్య మండలికి దర్శకుని బాధ్యతను నిర్వహించి మొదట సుంకర వాసిరెడ్డి రచించిన "ముందడుగు" నాటకాన్ని ప్రదర్శించారు. తర్వాత గుడివాడలో రావూరి రచించిన పరితాపం నాటకాన్ని తయారుచేసి ఆంధ్ర నాటక పరిషత్తులో ప్రదర్శించారు. ఈ సమయంలోనే మెరికల వంటి ఉత్తమ నటీనటులను ఈయన తీర్చిదిద్దారు. పెదపాలపర్రులో నవభారత నాట్యమండలి, గుడివాడలో శ్యామల నాట్యమండలులను వీరు స్థాపించారు. ఈ మండలులద్వారా అనేక సాంఘిక నాటకాలు ప్రదర్శించడమే కాక, త్రిపురనేని రామస్వామి చౌదరి గారి "ఖూనీ" నాటకాన్ని రంగస్థలిపై ప్రదర్శించి రక్తి కట్టించిన ఖ్యాతి దక్కించుకున్నారు. వీరు పిల్లల కోసం కొన్ని నాటికలు, పెత్తందారు, ధర్మచక్రం, విజయభేరి మొదలైన నాటకాలను స్వయంగా రచించారు.

సినిమా రంగం సవరించు
వీరు చలనచిత్ర రంగంలో ప్రవేశించి పల్లెటూరు, పుట్టిల్లు, కన్నతల్లి, వయ్యారి భామ, లక్ష్మి, పరివర్తన, పిచ్చిపుల్లయ్య, బాల సన్యాసమ్మ కథ మొదలైన సినిమాలలో విభిన్నమైన పలు పాత్రలు ధరించారు. అయితే అక్కడి వాతావరణం నచ్చక సినిమా రంగంలో అన్ని అవకాశాలు వుండి కూడా, మిత్రులు బలవంతపెట్టినా ఆ రంగాన్ని విడిచిపెట్టి తిరిగి గుడివాడ వెళ్ళి అనేక నాటక సమాజాలకు దర్శకత్వం వహించారు.

శ్రీ పువ్వుల సూరిబాబు

శ్రీ పువ్వుల సూరిబాబు గుడివాడ కే గర్వం...గౌరవం
అలనాటి సుప్రసిద్ధ తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త.
వీరు ఫిబ్రవరి 22, 1915 సంవత్సరంలో గుడివాడ తాలూకా బొమ్మలూరు గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే మేనమామ హనుమాన్లు గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. నాటకాల మీద మోజుతో గద్వాల పారిపోయి, సంస్థానపు నాటక సమాజంలో చేరి పాత్రలు పోషించి తిరిగివచ్చారు.
ఆనాడు గుంటూరులో దంటు వెంకటకృష్ణయ్య "బాలమిత్ర సభ" పేరుతో చిన్నపిల్లల నాటక సమాజాన్ని నడుపుతున్నారు. అందులో కొప్పరపు సుబ్బారావు గారు నాటక ప్రయోక్తగా, సంగీత దర్శకులుగా శిక్షణ ఇస్తున్నారు. సూరిబాబు ఈ సభలో చేరి వివిధ వేషాలు పోషించి అనతికాలంలోనే అగ్రశ్రేణి నటుడిగా పేరుపొందారు. ఆనాటి నాటక సమాజాల వారు సూరిబాబు కోసం పోటీపడేవారు.
నాటక సమాజ
సూరిబాబు 1931 సంవత్సరంలో బాలకృష్ణ నాటక సమాజాన్ని గుడివాడలో స్థాపించి భక్త విజయం, మాయా మధుసూదన నాటకాలను పెద్ద ఎత్తున ప్రదర్శించారు. నష్టాలతో సమాజం మూతపడింది. 1936లో తెనాలి చేరి సత్యనారాయణ నాట్యమండలి పేరుతో నాటకాలను ప్రదర్శించారు.
1944 సంవత్సరంలో నటీమణి రాజరాజేశ్వరిని వివాహం చేసుకొని ఆమె పేరుమీద రాజరాజేశ్వరి నాట్యమండలిని స్థాపించి కొప్పరపు సుబ్బారావు గారితో "తారా శశాంకం" నాటకాన్ని వ్రాయించి తానే దర్శకత్వం వహించి చనిపోయేవరకు 15 వందలకు పైగా నాటకాలు ఆంధ్రదేశమంతా ప్రదర్శించారు. ఇది కాక భూకైలాస్, కురుక్షేత్రం, విప్రనారాయణ, తులాభారం మొదలైన పౌరాణిక నాటకాలను భారతదేశమంతా ప్రదర్శించి అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించారు.
వీరు చాలా విభిన్నమైన పాత్రలను పోషించారు. వాటిలో నారదుడు, కంసుడు, ధర్మరాజు, విప్రనారాయణ, బిల్వమంగళుడు, భవానీశంకరుడు, రాజరాజు, సుబుద్ధి, రామదాసు, చినరంగారావు, ధర్మారాయుడు మొదలైనవి ముఖ్యమైనవి. ఎన్ని నాటకాలాడినా, ఆయన గాత్రం కంచు గంటలా మారుమ్రోగేది. మైక్ లేకపోయినా ఒక ఫర్లాంగు దూరం వరకు పద్య పఠనము, వాచిన విధానము క్లియర్ గా వినపడేవి. పద్యాన్ని భావయుక్తంగా విరిచి పాడడంతో ప్రేక్షకులను అవలీలగా ఆకట్టుకొనేవారు.
1946లో మైసూరు మహారాజావారి దర్బారులో వీరి నాటకాలను ప్రదర్శించి సన్మానం పొందారు. 1957లో తెనాలిలో సూరిబాబుకి గజారోహణం, గండపెండేరం మొదలైన సన్మానాలు జరిపి కళావిశారద, గాన గంధర్వ మొదలైన బిరుదులు అందుకున్నారు.

సినీ ప్రస్థానం
దక్షయజ్ఞం (1962) (నటుడు మరియు గాయకుడు)
ఉషా పరిణయం (1961)
శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం (1960) (నటుడు మరియు గాయకుడు)
కృష్ణ లీలలు (1959) (నటుడు)
సతీ సావిత్రి (1957) (నటుడు)
శ్రీకృష్ణ తులాభారం (1955) (నటుడు)
జీవన ముక్తి (1942)
తారా శశాంకం (1941) (నటుడు మరియు గాయకుడు)
రైతు బిడ్డ (1939) (నటుడు)
మాలపిల్ల (1938) (నటుడు మరియు గాయకుడు)
కనకతార (1937
భారతదేశమంతా అపార ఆదరాభిమానాలను సంపాదించిన సూరిబాబు ఫిబ్రవరి 12, 1968 న స్వర్గస్తులైనారు.

శ్రీ తమ్మారెడ్డి కృష్ణమూర్తి

 తమ్మారెడ్డి కృష్ణమూర్తి
స్వర్ణోత్సవం జరుపుకున్న ‘రవీంద్ర ఆర్ట్‌ పిక్చర్స్‌’ సంస్థ ద్వారా ఎన్నో మంచి, సందేశాత్మాక, విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ‘పెద్దాయన’ తమ్మారెడ్డి కృష్ణమూర్తి. చిత్ర పరిశ్రమ వర్ధిల్లడానికి తన వంతు కృషిని అహర్నిశలు చేసిన మహామనిషి. ఆయన వివరాలు స్ఫూర్తిదాయకం.

* నేపథ్యం...

1920 అక్టోబర్‌ 4న జన్మించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి అసలు పేరు గోపాలకృష్ణమూర్తి. కృష్ణా జిల్లా చినపాలపర్రు కృష్ణమూర్తి స్వగ్రామం. కమ్యూనిస్టు భావాలు పెనవేసుకున్న యువకునిగా ప్రజానాట్యమండలి ద్వారా అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, స్వాతంత్య్ర పోరాటంలో తన వంతు కృషి చేసిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి మద్రాసు నగరం చేరి బతుకుతెరువు కోసం సినీ నటుల పిల్లలకు పాఠాలు చెబుతుండేవారు. అలా పరిచయమైన సినిమా పరిశ్రమ కృష్ణమూర్తి ప్రతిభను వదులుకోలేదు. దర్శకులు తాతినేని ప్రకాశరావు పీపుల్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను నెలకొల్పి ఎన్‌.టి.ఆర్‌. సావిత్రిలతో తొలి ప్రయత్నంగా నిర్మించిన ‘పల్లెటూరు’ (1952) చిత్రానికి ప్రొడక్షన్‌ మేనేజర్‌గా కృష్ణమూర్తి పనిచేశారు. సారథి స్టూడియోతో కృష్ణమూర్తికి అనుబంధం పెరిగింది. 1955లో సారథి ఫిలిమ్స్‌ నిర్మించిన సంచలన చిత్రం ‘రోజులమారాయి’కి తాపీ చాణక్య వద్ద ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. సారథి స్టూడియో హైదరాబాద్‌ నగరంలో ఉండటంచేత తన మకాం హైదారాబాద్‌కి తరలించి సారథి స్టూడియో నిర్వాహణ బాధ్యతలు చేపట్టారు. స్టూడియోకి క్రమంగా జనరల్‌ మేనేజర్‌గా, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎదిగి హైదరాబాద్‌లో చిత్ర నిర్మాణ పరిశ్రమ ఎదుగుదలకి కృషి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరానికి తలమానికంగా ఉండే ‘ఫిలిం నగర్‌’ వ్యవస్థాపకులు తమ్మారెడ్డి కృష్ణమూర్తి అని తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. మద్రాసు నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కి తరలిరావాలంటే, అటు కళాకారులకి, ఇటు నిర్మాతలకీ మౌలిక వసతులు ఉండాలని సంకల్పించి ‘ఫిలిం నగర్‌’ సొసైటీని స్థాపించి, కొండలు గుట్టలుతో నిండివున్న ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఇప్పుడు దాన్ని ఒక ‘టాలీవుడ్‌ హాలీవుడ్‌’ఘా తీర్చిదిద్దిన ఘనత తమ్మారెడ్డి కృష్ణమూర్తిది.

* రవీంద్ర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ ఆవిర్భావం...

1962లో స్వంత చిత్ర నిర్మాణ సంస్థను తమ్మారెడ్డి నెలకొల్పారు. రవీంద్ర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ అని పిలిచే ఈ సంస్థ చిహ్నాన్ని విశ్లేషిస్తే తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఆశయస్ఫూర్తి అర్థమౌతుంది. విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ అంటే కృష్ణమూర్తికి అవ్యాజమైన అభిమానం. రవీంద్ర చిత్ర బ్యానర్‌ మీద మొదట కనపడేది రవీంద్రుని రేఖాచిత్రం. ఈ చిత్రంలో ఇమిడిపోయిన మరో చిత్రం శృంఖాలాలను తెంచుకొని చెయ్యెత్తి చూపుతూ ‘‘స్వాతంత్య్రం, శాంతి, అభ్యుదయం... మీ నివాళి మా ధ్యేయం’’ అంటూ నినదించే కార్మికుని ఆవేశభరిత గర్జన. ఈ లోగో చాలు తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఆశయ సిద్ధి ఎలాంటిదో బేరీజు వెయ్యడానికి. ‘‘సారథి స్టూడియో నాకు విశ్వవిద్యాలయం. సకలం నేర్పిన నా తల్లి సారథి’’ అని అందరికీ చెప్పేవారు కృష్ణమూర్తి. ఆయన నిరాడంబరత ఎలాంటిదంటే, శ్రీనగర్‌ కాలనీ నుంచి సారథి స్టూడియోకి నడిచి వెళ్తుండేవారు. తెలిసిన వాళ్లెవరైనా లిప్టు ఇస్తామంటే ‘‘లేదండీ. నేను వాకింగ్‌ చేస్తున్నా. మీరు వెళ్లండి’’ అనేవారు. రవీంద్ర ఆర్ట్‌ ప్రొడక్షన్‌ కింద మొదటి ప్రయత్నంగా ‘లక్షాధికారి’ అనే అపరాధ పరిశోధక చిత్రాన్ని తమ్మారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం 1963 సెప్టెంబర్‌ 27న విడుదలైంది. ఎన్‌.టి.ఆర్‌., కృష్ణకుమారి జంటగా ఈ చిత్రాన్ని వి.మధుసూదనరావు దర్శకత్వంలో టి.చలపతిరావు సంగీత నిర్వహణలో రూపొందించారు. మధుసూదనరావు, చలపతిరావు ఇద్దరూ ప్రజానాట్యమండలి సభ్యులు కావడం విశేషం. చిత్రం బాగానే ఆడింది. ఆ సమయంలో ‘నర్తనశాల’, ‘మంచీ-చెడు’, ‘తోబుట్టువులు’ వంటి ఎన్‌.టి.ఆర్‌ చిత్రాలు విజయవంతంగా ఆడుతుండడంతో ‘లక్షాధికారి’ చిత్రం 11 వారాల ప్రదర్శనకు మాత్రమే నోచుకుంది. కానీ చిత్రానికి మంచిపేరు వచ్చింది. ఈ చిత్రం తరువాత వరుసగా అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు, కృష్ణంరాజు, రంగనాథ్‌లతో చిత్రాలు నిర్మించారు. అవే: ‘జమీందార్‌’, ‘బంగారు గాజులు’, ‘ధర్మదాత’, ‘సిసింద్రీ చిట్టిబాబు’, ‘దత్తపుత్రుడు’, ‘డాక్టర్‌ బాబు’, ‘చిన్ననాటి కలలు’, ‘అమ్మ-నాన్న’, ‘లవ్‌ మ్యారేజ్‌’, ‘ఇద్దరు కొడుకులు’ చిత్రాలు. ‘జమీందార్‌’ చిత్రానికి వి.మధుసూదనరావు; ‘బంగారుగాజులు’ చిత్రానికి సి.ఎస్‌.రావు; ‘ధర్మదాత’, ‘సిసీంద్రి చిట్టిబాబు’ చిత్రాలకు ఎడిటర్‌ అక్కినేని సంజీవి; ‘దత్తపుత్రుడు’, ‘డాక్టర్‌ బాబు’, ‘చిన్ననాటి కలలు’, ‘అమ్మానాన్న’, ‘లవ్‌ మ్యారేజ్‌’ చిత్రాలకు తమ్మారెడ్డి కృష్ణమూర్తి పెద్దకుమారుడు లెనిన్‌బాబు దర్శకత్వం వహించారు. అనారోగ్య కారణాల చేత లెనిన్‌ బాబు అకాలమరణం చెందగా 1976 తర్వాత చిత్ర నిర్మాణం కొంతకాలం ఆగిపోయింది. తరువాత కట్టా సుబ్బారావు దర్శకత్వంలో ‘ఇద్దరు కొడుకులు’ చిత్రాన్ని 1982లో తీసారు. అక్కినేని సంజీవి, పి.చంద్రశేఖర్‌రెడ్డి వంటి దర్శకులను పరిచయం చేసిన ఘనత తమ్మారెడ్డి కృష్ణమూర్తికి దక్కుతుంది.
                                                                                                                                                           

శ్రీ బి.ఎన్. సూరి


💥 గుడివాడ కే  గర్వం..గౌరవం...శ్రీ బి.ఎన్. సూరి...
మాయల ఫకీరు పాత్ర మన సూరికే సరి...💥        
శ్రీ బి.ఎన్. సూరి...
ఫకీరు పాత్ర వీరికే సరి....
 వీరు ప్రసిద్ధ రంగస్థల నటులు, రచయిత, సమాజ నిర్వాహకులు
శ్రీ బి.ఎన్. సూరి గారి పూర్తి పేరు
భావన నారాయణ సూరి.వీరు గుడివాడ దగ్గరవున్న బేతవోలు గ్రామములో1935 లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు
రామయ్య సూరి, రంగనాయకమ్మగారలు..
★రంగస్థల ప్రస్థానం
పోలీస్ వైర్ లెస్ సెట్ ఆపరేటర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేసిన వీరు నాటకరంగంపై ఇష్టంతో ఉద్యోగాన్ని వదిలి,నటుడు గా నటిస్తూ, నాటక సమాజాన్ని స్థాపించి నాటకాలు రాసి, ప్రదర్శించేవారు...
మాయల ఫకీరు పాత్రకు వీరు సుప్రసిద్ధులు...అజానుభాహులైన వీరు మాయల ఫకీరు ఆహార్యంలో...విరబోసిన దుబ్బు జుట్టుతో....గుండెలపై పుర్రె ఎముకల బొమ్మలతో ఉన్న.. పైనుంచి క్రిందవరకూ వేసిన నల్లటి అంగీతో..  కొద్దిగా ఎడమవైపుకు వంగి...కుడి వైపు కనుబొమ్మను విల్లులా పైకి లేపి..కుడిచేలో మనిషి పుర్రి..ఎడమచేతిలో తొంటి ఎముకను మంత్ర దండములా చేబూని...మధ్య మధ్యలో యడమకన్ను చిట్లిస్తూ.. వికృతమైన చూపుతో..భ యంకరాకారంతో... గంభీరమైన కంఠం తో...గగుర్పాటు కలిగించే వికట్టాట్టహాసాలతో...ఖాపాళీ..... !!!
అంటూ మేఘఘర్జన లాంటి స్వరంతో..ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేస్తూ..భీభత్సరసాన్ని పోషించేవారు ... 
నాటక నిర్వహకులు ఫకీరు పాత్ర ప్రవేశ సమయంలో, స్టేజీకి దగ్గరలో చిన్నవారినీ...ముసలివారినీ...గుండెజబ్బులు ఉన్నవారిని..గర్భిణీ స్త్రీలను  కూర్చోనిచ్చేవారు కాదు.. 
ఫకీరు పాత్రలో వీరిని చూచిన జనం సాధారణ మనిషిగా వున్నప్పుడు కలిస్తే జంకుతూ దూరంగా వుండేవారు..
వీరి నటన చూచిన నాలాంటి వారు  వీరిని ఇప్పటికీ మరువలేరు...
ఆ రోజుల్లో ఫకీరు పాత్ర పోషణ విషయంలో ఆంధ్రదేశంలో వల్లూరి వెంకట్రామయ్య చౌదరి గారికీ .. బి.ఎన్. సూరి గారికీ పోటా పోటీగా ఉండేది..ఆంధ్ర నాటకరంగం లోఫకీరు పాత్రతో గుడివాడకే గర్వకారణం గా నిలిచారు...
వీరి మాయల ఫకీరు నటనచూచి, గుడివాడ ప్రాంతచలన చిత్ర నిర్మాత ఒకరు వీరికి తన చిత్రంలో విలన్ పాత్ర కు బుక్ చేసి మేకప్ టెస్ట్...వోకల్ (ఆడిషన్) టెస్టింగ్ చేసే సమయాన వీరి నటన చూచిన, అక్కడ ఉన్న ఆనాటి విలన్ పాత్రలలో రాణిస్తున్న ఒక మాయల ఫకీరు మతి తప్పి, తనకు దుర్గతి పట్టకుండా, తన పరపతి మాయతో వీరిని చిత్రరంగానికి దూరం చేశారని అప్పట్లో చెప్పుకునే వారు... చిత్ర రంగంలో రాణించాలంటే ప్రతిభ ఎంతవున్నా, వెనక అనే "కుల అండ"వుండాలన్నది జగద్విఖితమే...!!
ఆది లేని వీరు తిరిగి గుడివాడవచ్చి నాటక సమాజాన్ని స్థాపించి..తన బృందం అయిన శ్రీ టి. పూర్ణచంద్రరావు(పూర్ణ), శ్రీ దేవి వరప్రసాద్,(ప్రసాద్) తన శ్రీమతి బి.ఎన్. సీతాకుమారితో కలిసి తాండ్ర వేంకట సుబ్రహ్మణ్యం రచించిన "మహిషాసుర మర్థని" నాటకాన్ని అనేకచోట్ల వేల ప్రదర్శనలు ఇచ్చారు.దీనిలో వీరి మహిషారుని పాత్రలో అద్భుతంగా జీవించేవారు. గుడివాడ ప్రాంతంలోని అనేకమంది నాటక కళాకారులకు, సాంకేతిక నిపుణుల ఉపాధిని కృషిచేశారు...
అలాగే గుడివాడలో వుండే అక్కినేని నాగేశ్వరరావు గారి అన్న అక్కినేని మల్లిఖార్జునరావు గారి అబ్బాయి అయిన అక్కినేని వెంకటరత్నం(వీరు అచ్చం అక్కినేని వారిలావుండేవారు) హీరోగా  కొన్నివేల ప్రదర్శనలు ఇచ్చిన "పూలరంగడు" సాంఘిక నాటకం లో  ప్రతి నాయకుడు  పాత్రతో నాటకాన్ని రక్తికట్టించేవారు.

ప్రత్యక్షంగా... పరోక్షంగా నాటకరంగానికి ఎనలేని సేవలు అందించి,నాటకాన్నే శ్వాసిస్తూ...నాటకంలో భాసిస్తూ...రాణిస్తూ...శెభాషని పిస్తూ... నాటకాన్నే ఊపిరిగా జీవించిన  శ్రీ బి.ఎన్ సూరి గారు 1995లో నాటకం వేస్తూ రంగస్థలంపైనే తుది శ్వాస విడిచారు...

శ్రీ కటారి సత్యం గారు...గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మన్...

శ్రీ మద్దుకూరి చంద్రశేఖరరావు

శ్రీ మద్దుకూరి చంద్రశేఖరరావు..

 వీరు గుడివాడ ప్రాంతపు కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధులు...
తెలుగు సాహిత్యానికి, జర్నలిజానికి మార్క్సిస్టు చూపునిచ్చిన దార్శనికుడు. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమానికి బలమైన పునాదులు వేసినవారు
వీరు కృష్ణాజిల్లా, పెదపారుపూడి మండలం, వెంట్రప్రగడ గ్రామంలో 1907లో జన్మించారు. వీరు విద్యార్థి దశలో జాతీయోద్యమంలో పాల్గొని దాని నుంచి కమ్యూనిస్టు ఉద్యమానికి వచ్చారు. వీరు ఇంజినీరింగ్‌ విద్యార్థిగా 1930లో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1932లో వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొన్న సందర్భంలో పోలీసులు ఇతడిని చిత్రహింసలు పెట్టారు. రెండేళ్ల కఠిన జైలు శిక్ష విధించారు. జైలులోనే మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేసి అవగాహన చేసుకున్నారు. తన పంథా నిర్ధారించుకున్నారు. తనతోపాటు అనేక మంది యువకులను సమీకరించి పార్టీకి సుశిక్షితులైన సైనికుల్లా మార్చారు. పుచ్చలపల్లి సుందరయ్య, కంభంపాటి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావుతో కలిసి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి తనదైన ముద్రతో పనిచేశారు. క్షేత్రస్థాయిలో పనిచేయడంతోపాటు ఓ మేధావిగా శైశవ దశలో కమ్యూనిస్టు పార్టీకి కొన్ని విషయాల్లో వీరు మార్గదర్శకం చేశారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం, మాతృదేశ దాస్య విముక్తి ఉద్యమాన్ని సమన్వయం చేసి పార్టీని నడిపించడంలో వీరు చూపిన మార్గమే దిక్సూచిలా నిలిచింది. సోవియట్‌ యూనియన్‌పై నాజీల దాడి నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న వైఖరికి జాతీయవాదుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఆంధ్ర కమ్యూనిస్టులు వీరి నాయకత్వాన సంయమనంతో ముందుకు సాగారు. సుభాష్‌చంద్రబోస్‌లాంటి పొరబడిన దేశభక్తులపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడాన్ని తొలినుంచి ఇతడు వ్యతిరేకించాడంటే ఈయన ముందుచూపు, పరిస్థితులపై ఈయన అవగాహన స్పష్టమవుతోంది. వీరు రాసిన వ్యాసాలు 'గాంధీ-ఇర్విన్‌ నాటినుంచి జమీందారీ పోరాటం వరకు' కాంగ్రెస్‌ నిర్వహించిన రాజకీయాలు ఏమిటో అర్థమవుతాయి. ఒక దశలో కమ్యూనిస్టు పార్టీపై జరిగిన కువిమర్శలను తిప్పికొట్టడంలో వీరు తన వ్యాసాలను ఆయుధాలుగా ఎక్కుపెట్టారు.

 శ్రీ మద్దుకూరి చంద్రశేఖరరావు పాత్రికేయ జీవితం 1937లో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభించిన పత్రిక నవశక్తి సంపాదకునిగా ప్రారంభమయ్యింది. పార్టీ రహస్యపత్రిక స్వతంత్ర భారత్‌, 1942-45 మధ్య ప్రజాశక్తి వారపత్రి కకు, 1946నుంచి 1948 నిర్బంధ కాలంలో మూసివేసే వరకు ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులుగా పనిచేశారు. 1948లో అరెస్టు అయ్యారు. 1952లో విశాలాంధ్ర దినపత్రిక ప్రారంభంలో ప్రధాన సంపాదకునిగా వ్యవహరించారు. 1964నుంచి68 వరకు సంపాదక వర్గంలో ఒకనిగా ఉన్నారు. ప్రగతి సచిత్రవారపత్రికకు 1969 నుండి 1974 వరకు ప్రధాన సంపాదకునిగా వ్యవహరించారు. జయభారత్, రెఢీ అనే రహస్య పత్రికలు ఇతడి నాయకత్వంలో నడిచాయి. ఇతని పత్రికారచన ఎంతో సులువుగా, సూటిగా, సరళంగా పల్లె ప్రజలను లక్ష్యంగా చేసుకొని సాగింది.

ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి వీరి చేసిన కృషి గణనీయమైంది. మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు కమ్యూనిస్టు పార్టీ ఇతని నాయకత్వంలో నిజమైన పోరాటం చేసింది. నాగరికత, చరిత్ర, సంస్కృతి, సాహిత్యంపై కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొనడానికి వీరి చొరవే ప్రధాన కారణం. సోషలిస్టు భావాలను, మార్క్సిస్టు సిద్ధాంతాలను ప్రజల్లో ప్రచారం చేయడానికి, ప్రజల సమస్యలు వెలుగులోకి తెచ్చి, వాటి పరిష్కారానికి సాగే ఉద్యమాలకు ఊతంగా నిలవడానికి పత్రికల ద్వారా ఇతడు కృషి చేశారు. కమ్యూనిస్టు ఉద్యమాభివృద్ధికి, ప్రజాతంత్రశక్తుల సమీకరణకు తన వ్యాసాలు, సంపాదకీయాల ద్వారా ఇతడు తపించారు. 1951నుంచి 56వరకు రాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. వీరు ఏనాడు పదవుల్ని ఆశించలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పదవుల కన్నా పార్టీ నిర్మాణమే ముఖ్యమని నమ్మారు. 1952లో రాజ్యసభకు పంపాలని పార్టీ నిర్ణయిస్తే సున్నితంగా తిరస్కరించారు. పార్టీలో ముఠాతత్వానికి నిరసనగా అన్ని బాధ్యతలు వదిలి కర్నూలు వెళ్లి సామాన్య రైతు జీవితం గడిపారు. అక్కడ కూడా సామాన్య కార్యకర్తగా పార్టీ నిర్మాణానికి కృషిచేశారు. వీరు గుడివాడ ప్రాంతపు కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధులు...
(((((((((((((((((((((((((((₹
  స్వాతంత్య్ర సమరయోధులు, కమ్యూనిస్టు జర్నలిజం పితామహులు మద్దుకూరి చంద్రశేఖరరావు గారి 37వ వర్ధంతి సందర్భంగా స్మారక సభ జులై 30వ తేదీన విజయవాడ చంద్రంబిల్డింగ్స్‌లో జరిగే సందర్భంగా సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి చండ్రరాజేశ్వర రావు, చంద్రం గారి సంస్మరణ సభలో చేసిన ప్రసంగాన్ని ఇక్కడ ఇస్తున్నాం...స

దాదాపు 40 సంత్సరాలుగా చంద్రం గారితో నాకు పరిచయం ఉంది. 1937 నుండి వారి సహచరుడుగా వుంటూ వచ్చాను. మేమంతా రాష్ట్ర కమిటీలో ఉన్నప్పటికీ వారిని మేమంతా పెద్దగా గౌరవిస్తూ ఉండేవాళ్ళం. మన ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు పార్టీకి పునాదిరాయి వేసిన వారిలో వారొకరు. శ్రీ సుందరయ్య, శ్రీ కంభంపాటి సత్యనారాయణ, శ్రీ చలసాని వాసుదేవరావు మొదలగువారితో పాటు చంద్రంగారు కూడా మన ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి పునాది వేశారు. అప్పటి నుండి వారిజీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితం చేశారు. నిస్వార్థంగా నిరాడంబరంగా వారు సేవ చేశారు.

జాతీయోద్యమ సాంప్రదాయాలు

కమ్యూనిస్టు ఉద్యమానికి వారు తీసుకొని వచ్చిన కొన్ని ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా అనేకమంది యువకులు జాతీయోద్యమాలలో పాల్గొన్నవారు చాలామంది మనరాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నారు. వారందరికీ కూడా జాతీయోద్యమం యొక్క మంచి సాంప్రదా యాలున్నందువల్ల, వారు స్వయంగా ఆకళింపు చేసుకున్నందు వలన ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు ఉద్యమంలోకి వాటన్నిటినీ తీసుకొని వచ్చారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతాన్నుండి కూడా అక్కడ జాతీయోద్యమానికి నాయకత్వం వహిం చిన వారందరూ దాదాపు నూటికి 90 మంది కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చారు. శ్రీ నారా యణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లకీëనరసింహా రెడ్డి, సర్వదేశభట్ల రామనాథం, దేవులపల్లి వెంకటేశ్వరరావు యిత్యాదులందరూ కూడా జాతీయోద్యమం నుండి వచ్చినవారే. అయితే వీరందరూ కమ్యూనిస్టు ఉద్యమంలోకి 1940 ప్రాంతాలలో వచ్చారు. కాని చంద్రంగారు 1934 ప్రాంతాలలోనే వచ్చారు.

నవయుగ వైతాళికుల సుసంప్రదాయాలు

అదేవిధంగా మన ఆంధ్రుల యొక్క సుసాంప్ర దాయాలు ముఖ్యంగా నూతన యుగానికి వైతాళికులుగా ఉన్న వీరేశలింగం పం తులుగారు, గురజాడ అప్పారావుగారు చిలకమర్తి లకీëనరసింహంగారు గిడుగు రామమూర్తి పంతులుగారు మొదలైన వారంతా ఆంధ్రదేశంలో ఆధునిక యుగానికి ప్రారంభోత్సవం చేశారు. వారి సుసాంప్ర దాయాలను మన కమ్యూనిస్టు ఉద్యమంలోకి తీసుకురావడంలో చంద్రంగారు చాలా పెద్ద పాత్ర నిర్వహించారు. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే తరువాత కమ్యూనిస్టు ఉద్యమంలో అనేకమైన ఘట్టాలు వచ్చాయి. ఒడుదుడుకులు కూడా వచ్చాయి. ఈ సందర్భంలో చంద్రంగారి యొక్క ఈ అనుభవం, అంటే జాతీయోద్యమం యొక్క అనుభవం, జాతీయోద్యమాన్ని అర్ధం చేసుకోవడంలో ఆంధ్రదేశంలో వున్న కమ్యూనిస్టు ఉద్యమానికి ఎంతో తోడ్పడ్డారు. అనేక ఘటనలు తరువాత వచ్చాయి.

సాంస్కృతిక పునరుజ్జీవన : పార్టీ కృషి

ఆంధ్ర కమ్యూనిస్టు ఉద్యమానికి మొదటినుండి ఒక ప్రత్యేకత ఉంది. కేరళవంటి కొన్ని రాష్ట్రాలలో ఉంది. ఏమిటంటే భారతదేశం యొక్క నాగరికత గురించికాక ఆ రాష్ట్ర ప్రజలయొక్క నాగరికత, సంస్కృతి, సాహిత్యం మున్నగువాటి పట్ల శ్రద్ధ తీసుకొనే విషయం, ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమం మొదటి నుండి శ్రద్ధ తీసుకుంది.

ఉదాహరణకు కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు మున్నగువారి గురించి అసలు అందరూ మర్చిపోయిన స్థితిలో ఏ కాలేజీలోనైనా కందుకూరి వీరేశలింగంగారు ఎవరంటే ఎవరూ చెప్పలేని స్థితి ఏర్పడింది. నవయుగాంధ్ర వైతాళికుల రచనలను ఆవిధగా పాతిపెట్టేయడం జరిగింది.

1943లో వారి రచనలన్నింటినీ బైటికి తీశాం. వీరేశలింగం పంతులుగారి జీవితచరిత్ర, ప్రహసనాలు, వారి ఉత్తమమైన నాటకాలు, తిరిగి బైటకుతీసుకొని వచ్చాం. అట్లాగే గురజాడ అప్పారావుగారి ముత్యాల సరాలు-వారి కన్యాశుల్కం అందరికి తెలుసు. కాని, ఆయన వ్రాసిన ముత్యాల సరాలు గురించి జనబాహుళ్యం అందరికీ తెలియదు. అయితే సాహితీవేత్తలకు తెలుసుననుకోండి. వాటిని తీసిచూస్తే మాకం దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. ఏవి కమ్యూనిస్టు సిద్ధాంతాలని మేము అనుకుంటూ వచ్చామో అవి సూచనప్రాయంగా గురజాడ అప్పారావుగారు ముత్యాల సరాల్లో చక్కగా అందరికీ అర్థమయ్యేట్టు ఉన్నాయి. అవన్నీ మేము అచ్చువేస్తే ఆ రోజుల్లో కొన్ని వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి. ఆ రోజుల్లో బహుశా జన్మభూమి అనుకుంటాను. ఆ పత్రికలో -''అసలు ఇవన్నీ అప్పారావుగారు వ్రాశారా? ఆయన ఏవో కొన్ని వ్రాస్తే కమ్యూనిస్టులు వాళ్ళ యిష్టం వచ్చినట్లు ఇవన్నీ కల్పించి వ్రాశాడు'' అని వ్రాసి పడవేశారు.

చిలకమర్తి వారి స్వీయచరిత్ర ప్రచురణ

అదేవిధంగా ఆ రోజుల్లో చిలకమర్తి లకీëనరసింహంగారు తమ వృద్ధాప్యంలో చాలా అవస్థలు పడుతున్న సమయంలో-తిండికి కూడా యిబ్బంది పడుతున్నప్పుడు, ఆయన స్వీయచరిత్ర ప్రచురించి, ఆయనకు ఆ రూపేణా ధనసహాయం చేయాలనుకున్నాం. కాని ఆయనకు ఎవరో ''కమ్యూనిస్టులు చాలా దుర్మార్గులు, వాళ్ళు అచ్చు వేసుకుంటారు. కానీ, డబ్బు మాత్రం యివ్వరు'' అని చెప్పారట. అందువలన ఆయన మొదట తన స్వీయచరిత్ర అచ్చు వేయడానికి యివ్వలేదు. అప్పుడు రాష్ట్ర కమిటీ తరపున వెళ్లి ఆయనకు వెయ్యిరూపాయలు యిచ్చి దానిని అచ్చువేసి ఆయనకు విజయవాడలో సన్మానం చేయటం జరిగింది.

తరువాత ఆయన ఆచరణలో కమ్యూనిస్టులు ఎటువంటివారో, ఎటువంటి నిజాయితీపరులో అర్దంచేసుకొని సన్మానసభలో అనేక విషయాలు చెప్పారనుకోండి. నేరు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే ఆంధ్రదేశానికి, ఆంధ్రదేశం మంచికి, ఆంధ్రప్రజల సంస్కృ తి మొదలైన వాటన్నింటికోసం కమ్యూనిస్టుపార్టీ చాలా త్యాగాలు చేసిందని నేను సగర్వంగా చెప్పుకోగల్గుతాను.

చంద్రంగారి ఆదర్శ గుణగణాలు

చంద్రంగారి గుణగణాల గురించి తెలిసిన వారు చాలామంది ఉన్నారు. ఆయన గురించిన సంస్కృతులు చాలా ఉన్నాయి. నేను కొన్నిటి గురించి మాత్రమే చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి.

లెనిన్‌ మహాశయుడు-ఆయన గుణగణాలు చాలా గొప్పవి. ఆయన పెద్ద సిద్ధాంతవేత్త. అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఆయన మహా విప్లవాన్ని చాకచక్యంగా నడిపారు. సాధించారు. మన చంద్రంగారికి అటువంటి అవకాశం దక్కకపోయినప్పటికీ లెనిన్‌ గారి జీవిత చరిత్ర గురించి ఏ గొప్ప గుణగణాలున్నాయని మనం చదువుకున్నామో చంద్రంగారితో అటువంటి గుణగణాలన్నింటిని మేము చూడగల్గాం. (హర్షధ్వనాలు) ఇంతపెద్ద జీవితంలో ప్రతివ్యక్తి ఏవోకొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. ఏ పొరపాట్లు చేయడని నేను ఆనుకోను. చంద్రంగారు చనిపోయిన తరువాత, మరోసారి ఆయనతో నాకు గల 40 ఏళ్ళ సహచర్య జీవితాన్ని ఒక్కసారి పరిశీలించి చూసినప్పుడు, నాకు మాత్రం ఏదీ దొరకలేదు. మానవునికి అనేక అపేక్షలుంటాయి. ఆవిదంగా ఉండటం తప్పుకాదు. కాని వాటిని సాధించడానికి తప్పు పద్ధతులు అవలంబిస్తే మాత్రం అది తప్పు. ఈ 40 ఏళ్ళ సహచర్య జీవితంలో ఆయనలో ఎటువంటి స్వార్థంకాని, లేక ఉద్యోగ అపేక్షగానీ,-ఇటువంటి ఏకోశానా నాకు కనబడలేదు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్య : పదవులు

బూర్జువా ప్రజాస్వామ్య సంస్థలలో స్థానం లేనంతవరకు కమ్యూనిస్టుపార్టీకి ఉద్యోగాపేక్ష ప్రమాదం ఏదీ సోకలేదు. కాని 1952 నుండి కూడా చాలా పెద్దయెత్తున అటువంటి అవకాశం వచ్చింది. అదొక నూతన యుగం. ఈ నూతన దశలో కమ్యూనిస్టు ఉద్యమానికి పెద్దగా అనుభవాలు లేవు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఈ బూర్జువా ప్రజాస్వామిక సంస్థలయొక్క అనుభవంలేదు. ఆ సందర్భంగా మా నల్గురిలో అంటే సుందరయ్యగారు, నేను, చంద్రంగారు, బసవపున్నయ్యగార్లలో ఎవరు ఎక్కడకు వెళ్ళాలి? ఏ బాధ్యతలు వహించాలి? అన్నప్పుడు సుందరయ్యగారు. బసవపున్నయ్యగార్లను పార్లమెంటులోను, సన్ను శాసనమండలిలోను ఉండమన్నారు. చంద్రంగారు కూడా రాజ్యసభకు వెళ్లాలన్న ప్రతిపాదన వచ్చింది. కాని చంద్రంగారు ''నేను ఎందుకయ్యా దాంట్లో? కె.ఎల్‌. నరసింహంగారిని పంపితే ఉపయోగపడుతుంది'' అన్నారు. ఆ ప్రకారంగానే కె.ఎల్‌. నరసింహంగారు అప్పుడు రాజ్యసభకు వెళ్ళారు. అది రైల్వే పనివారల ఉద్యమానికి ఉపయోగపడింది. అలా మొదట నుండి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంస్థలలో పదవులకు, అట్టి వ్యామోహానికి దూరంగా ఉంటూ వచ్చారు. చంద్రంగారిలో అట్టి వ్యామోహం ఏకోశానాలేదు. ఇట్టి వ్యామోహం నేడు కమ్యూనిస్టు ఉద్యమంలో లేకపోలేదు. ఈ బూర్జువా ప్రజాస్వామ్య యుగంలో అటువంటి అవలక్షణాలు అంటనివారు కొందరున్నారు. ఈ విషయంలో కూడా ఆయన నిప్పులా ఉండగల్గారు.

మంచి కమ్యూనిస్టు అనేవాడు ఎలా వుండాలి? అనే విషయమై లీషావ్‌చీ ఒక పెద్ద పుస్తకం వ్రాశారు. మార్క్స్‌, లెనిన్‌, ఏంగిల్స్‌ మొదలైన వారి జీవితాలు చూస్తే మంచి కమ్యూనిస్టు అనేవాడు ఎలా ఉండాలో అర్థ అవుతుంది. చంద్రంగారి జీవితం తీసుకున్నప్పటికీ ఆ విషయం అర్థమవుతుంది. దాంట్లో ఏమీ సందేహంలేదు.

పార్టీ ఐక్యతకోసం చంద్రంగారి కృషి

ఇక శిక్షణ విషయంలో ఆయనకు ఆయనే అందెవేసిన చేయి. ఏ ఒక్క సమయంలో కూడా ఆయన-పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘించలేదు. పార్టీ యొక్క ఐక్యతను కాపాడటం కోసం మన చంద్రంగారు చాలా కృషి చేశారు. రాష్ట్ర కమిటీలో తీవ్ర అభిప్రాయబేదాలు వచ్చినప్పుడు, చంద్రంగారు ఏదోవిధంగా సర్ది, ఆయన అభిప్రాయాలను కూడా ప్రక్కన బెట్టుకొని రాష్ట్ర కమిటీని ఐక్యంగా ఉంచడానికి కృషి చేశారు.

ఆ రోజుల్లో జైలులో కూడా చాలా అభిప్రాయ భేదాలొచ్చాయి. 1948-52 ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీలో అట్టి అభిప్రాయభేదాలు చాలా వచ్చినాయి. ఆ ఉద్యమాన్ని చివరికంటా యీడ్చడం వలన అవి వచ్చాయి. అందువల్ల చాలా నష్టం వచ్చింది. జైలులో కూడా తీవ్ర అభిప్రాయ భేదాలుంటే ఆ నాల్గు గోడల మధ్య ఒకరికొకరు చూసుకొనే పరిస్థితులు లేనప్పుడు-అది కడలూరు జైలు అనుకుంటాను. అప్పుడు ఆ జైలులో ఉన్న చంద్రంగారు దానిని చాలా ఐక్యంగా నిర్వహిం చారు. ఆ తరువాత పెరోల్‌ మీద జైలు నుండి బైటికి వచ్చి తప్పుకొని మళ్ళీ రహస్య జీవితానికి వెళ్ళారు. ఆ విధంగా ఎంతో శిక్షణను ఆయన కల్గి వున్నారు.

సామాన్య పార్టీ సభ్యునిగా చంద్రంగారి జీవితం

ఒక్క ఘటనను మాత్రం చెప్పాలి. నాయకుడు అన్నవాడు సామాన్య పార్టీ సభ్యుడుగా ఉంటం మాత్రం చాలా కష్టసాధ్యమైన విషయం. కాని చంద్రంగారు మాత్రం అది సాధ్యమని ఆచరణలో రుజువు చేశారు. ఎందుకంటే నాయకుడుగా ఉన్నవాణ్ణి తొలగించినప్పుడు అనేక అవలక్షణాలను ప్రదర్శించిన వారున్నారు. అసలు ఇటువంటివారు నాయకత్వంలో ఇన్నాళ్ళు ఎలా వున్నాడా? అని అనిపించేటట్లు ప్రవర్తించినవారు కూడా ఉన్నారు.

కాని పార్టీలో ముఠాతత్వం వచ్చిన తరువాత చంద్రంగారు ఒక నిశ్చయానికి వచ్చారు. ఇక తాను పార్టీని ఐక్యంగా ఉంచలేను ముఠాతత్వాలలో మాత్రం పాల్గోలేదు అని స్పష్టంగా రాష్ట్ర కార్యవర్గంలోను, రాష్ట్ర కౌన్సిల్‌లోను కూడా చెప్పారు. అప్పుడు తన భార్య పేర ఉన్న కొద్దిపాటి భూమి అమ్మి- తన పేర ఉన్న భూమిని ఎప్పుడో పార్టీకి యిచ్చి వేశారనుకోండి-కర్నూలు జిల్లా వెళ్ళిపోయి అక్కడ కొంత భూమికొని, సాగుచేసి, స్వయంగా దున్ని, డోకి ఆవిధంగా వ్యవసాయం చేసుకుంటూ అక్కడ ఒక చిన్న పార్టీ యూనిట్‌ను నిర్మించారు.

అందులో సామాన్య పార్టీ సభ్యులుగా ఉంటూ ఆవిధంగా శిక్షణాయుతంగా తన జీవితాన్ని గడిపారు. ఇది మనందరకు శిరోధార్యమైన విషయం. చంద్రంగారి గుణగణాలు చెప్పాలంటే యింకా చాలా వున్నాయి.

మేమంతా ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఆయన గుణగణాలను ప్రత్యక్షంగా చూశాం. నామట్టుకు నేను ఈవిషయంలో ఆయనను ఎల్లప్పుడూ ఆదర్శంగా పెట్టుకొని ఉన్నాను.

ఛార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ పర్వతనేని బ్రహ్మయ్య





ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్
పర్వతనేని బ్రహ్మయ్య
పి. బ్రహ్మయ్య అండ్ కంపెనీ అను సంస్థను స్థాపించి దానికి దేశవ్యాప్తముగా గౌరవము సంపాదించి, ఆడిటింగ్ అనే వృత్తిలో వేలమందికి శిక్షణనిచ్చి చిరస్మరణీయుడయ్యారు.

బ్రహ్మయ్య 1908, అక్టోబర్ 2 వ తేదీన కృష్ణా జిల్లా నూజెళ్ళలో జన్మించారు. 1928 లో మద్రాసు లయోలా కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. తరువాత లండన్ వెళ్ళి యఫ్.సి.ఎ అభ్యసించి ఇంకార్పొరేటెడ్ అకౌంటెంట్ అయ్యారు.

ఇంగ్లాండు నుండి స్వదేశానికి తిరిగి వచ్చి మద్రాసులో సి.ఏ.గా వృత్తి ప్రారంభించారు.1932 ఏప్రిల్ 1న బ్రహ్మయ్య అండ్ కంపెనీ స్థాపించారు. క్రమముగా తన కార్యకలాపాలు ఆంధ్ర రాష్ట్రము, బెంగుళూరు ప్రాంతాలకు వ్యాపింపచేశారు. 40 ఏళ్ళపాటు క్రియాశీలంగా విధులు నిర్వర్తించి 1972లో పదవీ విరమణ చేశారు. దేశంలో ఎన్నో ప్రైవేటు రంగ దిగ్గజాలకు తనదైన శైలిలో సేవలందించిన ఘనత బ్రహ్మయ్యది. పలు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, పరిశ్రమలకు ఛార్టర్డ్ అకౌంటెన్సీ సేవలందించారు. బ్రహ్మయ్య సంస్థ వారు ప్రభుత్వ రంగానికి చెందిన పలు సంస్థలకు ఆడిటర్లుగా పనిచేస్తున్నారు. 
పలు కంపెనీల బోర్డులలో డైరెక్టరుగా వ్యవహరించిన బ్రహ్మయ్యకు వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఎదుర్కొన్న సమస్యలపై నిశిత అవగాహన ఉండేది. అఖండ మేధా సంపత్తితో తానే ఒక సంస్థగా ఎదిగిన వ్యక్తిత్వం బ్రహ్మయ్యది. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొదలగు సంస్థలకు అధ్యక్షునిగా పనిచేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర మండలిలో డైరెక్టరుగా, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ధర్మకర్తలలో ఒకరుగా ఉన్నారు.

బ్రహ్మయ్య గొప్ప కళాభిమాని కూడ. మద్రాసులో జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనేవారు. 'కళాభారతి' కి ఏడేళ్ళపాటు అధ్యక్షునిగా పనిచేశారు. తెలుగు భాష సమితికి మూడు దశాబ్దాలకు పైగా గౌరవ కోశాధికారి.
ఎన్నో దానాలు, పలు విద్యాసంస్థలకు విరాళాలిచ్చారు. ఆయన పేరు మీద విజయవాడలో సిద్ధార్థ విద్యా సంస్థ ఒక కళాశాల స్థాపించబడింది.

బ్రహ్మయ్య 1980, జులై 20 న మరణించారు.


శ్రీ గూడవల్లి రామబ్రహ్మం



ప్రముఖ సినీ దర్శకుడు
శ్రీ గూడవల్లి రామబ్రహ్మం
◆◆◆◆◆◆◆◆◆◆◆◆
 
సినిమాకు పరమార్థం వ్యాపారం మాత్రమే కాదు, 
అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.హేతువాది .గూడవల్లి రామబ్రహ్మం1898లో జూన్ 24న కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలములోని నందమూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు గూడవల్లి వెంకయ్య, బాపమ్మల కలిగిన ఆరుగురు పిల్లలలో రామబ్రహ్మం చిన్నకొడుకు. 

తొలి తెలుగు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ స్వగ్రామం కూడా నందమూరే. 

రామబ్రహ్మం చదువు ఇందుపల్లి, గుడివాడ, బందరు లలో సాగింది. అతనికి 18 ఏళ్ళ వయసులో (1920)లో ఇందుపల్లి గ్రామానికి చెందిన కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబతో వివాహం జరిగింది. తర్వాత ఆయన చదువు మానేసి తన మామగారింట్లో విదేశీ వస్త్రాలను దహనం చేసి సహాయ
నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు.

1924లో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు ప్రారంభించాడు. అయితే ఆ షాపు వ్యాపారానికి బదులుగా రచయితలు, కళాకారుల సమావేశాలకు, చర్చలకు ఒక మంచి కేంద్రంగా తయారయింది. దాంతో వ్యాపారం తగ్గిపోయి 1930లో మూసివేయవలసి వచ్చింది. ఆయన 1931లో అఖిలాంధ్ర రైతు మహాసభను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నిర్వహించారు. 1934లో ఆంధ్ర నాటక పరిషత్ చతుర్థ సమావేశాలకు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దీనికి నాట్యకళ ప్రపూర్ణ బళ్ళారి రాఘవ అధ్యక్షులు. ఆయన 'కమ్మకుల చరిత్ర' అనే పుస్తకం వ్రాశారు. ఆ పుస్తకం వ్రాయడం కోసం కమ్మ కులం గురించి అవసరమైన సమాచారం సేకరించడానికి కడపకు వెళ్ళారు. అక్కడ ఆయన గండికోట పట్ల ఆకర్షితుడై ఆ కోట గురించి పరిశోధన చేసి 'గండికోట పతనం' అనే నాటకం వ్రాశారు. ఈ నాటకం అనేక నగరాల్లో ప్రదర్శించబడి మంచి ప్రజాదరణ పొందింది.

ఆయన మద్రాసు నుంచి 'ప్రజామిత్ర' వారపత్రికను పదేళ్ళ పాటు నడిపారు. ఆ రోజుల్లో మద్రాసుకు వెళ్ళే తెలుగు రచయితలు, కళాకారులకు ప్రజామిత్ర ఆఫీసే సమావేశ ప్రదేశమైంది. అంతవరకు రాజకీయ పత్రికగా నడిచే ప్రజామిత్రను సంగీత, సాహిత్య, నాటక, చిత్రకళా వ్యాసాలతో ఒక అపురూపమైన పత్రికగా రామబ్రహ్మం తీర్చిదిద్దారు. ఆయన ప్రజామిత్ర లోనే కాక సమదర్శిని, వాది లాంటి ఇతర పత్రికల్లో కూడా ఆర్టికల్స్ వ్రాశారు.

సముద్రాల రాఘవాచార్య, కుర్రా సుబ్బారావులు ఇతనికి సహాయపడుతుండేవారు. 
నార్ల వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రభలో చేరక మునుపు 1937లో ఇతనికి సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఆ తరువాత ఆండ్ర శేషగిరిరావు, ముద్దా విశ్వనాథం, బోయి భీమన్నలు కూడా పత్రికా సహాయ సంపాదకులుగా పనిచేశారు.

తాపీ ధర్మారావు, వేలూరి శివరామశాస్త్రి, త్రిపురనేని గోపీచంద్ మొదలైన వారు సాహిత్య వ్యాసాలు రాసేవారు. సంఘాన్ని నిష్కర్షగా విమర్శించి సంచలనం కలిగించే రచనలతో పత్రిక సాగించాలి. అపూర్వ విషయాలతో పత్రిక విజ్ఞాన సర్వస్వం అనిపించుకోవాలి అనే లక్ష్యాలతో రామబ్రహ్మం సమర్ధులైన రచయితల సహకారంతో పత్రికను నిర్వహించేవారు.

ఆయన ఆసక్తి సినిమాల మీదకుమళ్ళాక ఆయన పత్రికారంగాన్ని వదిలి పెట్టి 'సారథిచిత్ర' అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆయన 1934లో తీసిన 'శ్రీ కృష్ణ లీలలు' చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర వేయించడం కోసం రామబ్రహ్మం, నిర్మాత పి.వి.దాసు కలిసి 
రాజేశ్వర రావు అనే నటుడిని బెంగుళూరు నుంచి తీసుకు వచ్చారు. తర్వాత 1936లో విడుదలైన 'ద్రౌపదీ వస్త్రాపహరణం' సినిమాలో కూడా ఆయన పనిచేశారు. ఈ అనుభవాలతో చిత్రనిర్మాణ కళ తనకు పట్టుబడిన తర్వాత, పౌరాణిక చిత్రాల జోరులో కొట్టుకుని పోతున్న జనం అభిరుచులను మార్చడానికి సాహసించి సఫలుడైన ధీశాలి గూడవల్లి. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం 'మాలపిల్ల' ఆయన తీసిన తదుపరి చిత్రం. సారథిచిత్ర బ్యానర్ మీద రామబ్రహ్మం నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1938లో విడుదలైంది.

దక్షిణాది రాష్ట్రాల్లో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమంతో బాటు గాంధీజీ హరిజనోద్ధరణ ఉద్యమం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో రామబ్రహ్మం కులవ్యవస్థకు వ్యతిరేకంగా 'మాలపిల్ల' చిత్రాన్ని ఉన్నత ప్రమాణాలతో నిర్మించారు. అసలు సిసలు సామాజిక ప్రయోజనం గల చిత్రంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన చిత్రం 'మాలపిల్ల'. జస్టిస్ పార్టీ వారి సమదర్శినితో బాటు ప్రజామిత్ర పత్రికకూ సంపాదకుడైన రామబ్రహ్మం పత్రికల కన్నా సినిమాయే శక్తివంతమైన ప్రచార సాధనమని గుర్తించి ఊపిరిపోసిన చిత్రమిది. ఆనాడు దేశాన్ని పట్టి ఊపేస్తున్న హరిజనోద్యమాన్ని రామబ్రహ్మం తన సినిమాకు ఇతివృత్తంగా తీసుకుని,గుడిపాటి వెంకటచలంతో కథారచన చేయించారు. ఈ సినిమాకు తాపీ ధర్మారావు సంభాషణలు వ్రాశారు.చలం, ధర్మారావు ఇద్దరూ ఆనాటి సమాజంలో చలామణి అవుతున్న అర్థం లేని ఆచారాలను అపహాస్యం చేసిన వారే. 'మాలపిల్ల' చిత్రం లోని పాటలకు భావకవి బసవరాజు అప్పారావు కావ్యగౌరవం కల్పించారు.ఇందరు ప్రముఖుల సృజనాత్మక భాగస్వామ్యంతో తయారైన 'మాలపిల్ల' తెలుగు నాట అఖండ విజయం సాధించింది. జస్టిస్ పార్టీ నేతృత్వంలో 1920వ దశాబ్దంలో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమం జోరుగా నడిచిన ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

మాలపిల్ల చిత్రం కాంచనమాలను సూపర్ స్టార్ ను చేసింది. పౌరాణిక చిత్రాల జోరులో ప్రప్రథమంగా ఒక సమకాలీన సమస్యను ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రం అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు భాషాప్రాంతాల్లోనే గాక ఇతర భాషా ప్రాంతాల్లో కూడా పెద్ద హిట్. నాటి గాయని, నటి సుందరమ్మతో కలిసి ఆమె పాడిన 'నల్లవాడే గొల్లపిల్లవాడే' సూపర్ హిట్ అయింది. అప్పటికింకా భాషాదురభిమానం తలెత్తక పోవడంతో దక్షిణభారతమంతటా ఆ పాట జనం నాలుకలపై నర్తించింది.

ఆ నాటి సమాజంలో ఈ సినిమా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా తెలుగునాట కరపత్రాల పంపిణీ జరిగింది. అప్పట్లో బెజవాడలో జరిగిన ఒక 'నిరసన మహాసభ ' బ్రాహ్మణులు మాలపిల్లను చూడరాదని తీర్మానించింది. అయినా దొంగచాటుగా ఆ సినిమాను చూసి వచ్చిన యువబ్రాహ్మణులకు తల్లిదండ్రులు వీధిలోనే శుద్ధి స్నానం చేయించి గానీ ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. రామబ్రహ్మం కూడా "మాలపిల్ల ను చూడడానికి వచ్చే పిలక బ్రాహ్మణులకు టికెట్లు ఉచితం" అంటూ అగ్రహారాలలో కరపత్రాలు పంచాడు. 

ఆయన తీసిన తదుపరి చిత్రం రైతుబిడ్డ

 రైతుబిడ్డ (1939 సినిమా)
●●●●●●●●●●●●●●●

మాలపిల్ల తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా 'రైతుబిడ్డ' తీసి రామబ్రహ్మం తన సాహస ప్రవృత్తిని మళ్ళీ చాటుకున్నారు. 1925 లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఛత్రం క్రింద జాగృతులైన సన్నకారు రైతులు తమ హక్కుల సాధనకు నడుం కట్టారు. 1937లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ చారిత్రక నేపథ్యంలో రామబ్రహ్మం 'రైతుబిడ్డ'ను నిర్మించారు.

ఈ సినిమాకు రామబ్రహ్మం స్వయంగా కథ సమకూర్చగా త్రిపురనేని గోపీచంద్ మాటలు వ్రాశారు. కొసరాజు పాటలు వ్రాయగా, జమీన్ రైతు ఉద్మంలో నెల్లూరు వెంకట్రామానాయుడు వ్రాసిన గీతాలను కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. సంగీత దర్శకుడు బి.నరసింహారావు.

ఈ సినిమాకు వ్యతిరేకత సనాతన వర్గాలకంటే బలంగా జమీందార్ల నుంచి ఎదురైంది. 'మాలపిల్ల'ను ప్రభుత్వం నిషేధించలేదు. కానీ జమీందార్లు 'రైతుబిడ్డ' సిన్మాను ప్రభుత్వం చేత నిషేధింపజేయగలిగారు. ఇంకో విచిత్రమేమిటంటే జమీందార్ల ఘాతుకాలను నిరసించిన ఈ సినిమాను నిర్మించినది ఒక జమీందారు. ఈ చిత్ర నిర్మాత అయిన చల్లపల్లి రాజా జమీందార్ల పార్టీ అయిన జస్టిస్ పార్టీలో ఒక వర్గానికి నాయకుడు. పార్టీలో ఆయన ప్రత్యర్థి వర్గానికి నాయకుడైన మీర్జాపురం రాజా ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, తిరోగమన ధోరణిలో అనేక జానపద, పౌరాణిక చిత్రాలను నిర్మించారు.

'రైతుబిడ్డ' చిత్రాన్ని జమీందార్ల ఒత్తిడిపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినా ఆ చిత్రం ప్రతిబింబించిన స్ఫూర్తి కాలక్రమంలో విజయం సాధించింది. 1955లో విడుదలై ఘనవిజయం సాధించిన 'రోజులు మారాయి' చిత్రాన్ని 'రైతుబిడ్డ'కు కొనసాగింపు అనుకోవచ్చు. ఇటువంటి చిత్రాల ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైన కోస్తా రైతాంగ చైతన్యం కాలక్రమంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి వెన్నుదన్నుగా నిలిచింది. కులవ్యవస్థ నిర్మూలన సందేశం ఇవ్వడం కోసం కూడా రామబ్రహ్మం నడుం కట్టాడు. పల్నాటి బ్రహ్మనాయుడు పాత్ర ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వడానికి పల్నాటి యుద్ధం సినిమా తీశారు.

రామబ్రహ్మం తీసిన సినిమాలు:
●●●●●●●●●●●●●●●●●
మాలపిల్ల (1938) నిర్మాత, దర్శకుడు
రైతుబిడ్డ (1939) రచయిత, దర్శకుడు
ఇల్లాలు (1940) దర్శకుడు
అపవాదు (1941) దర్శకుడు
పత్ని (1942) దర్శకుడు
పంతులమ్మ (1943) దర్శకుడు
మాయలోకం (1945) దర్శకుడు
పల్నాటి యుద్ధం (1947) దర్శకుడు

రామబ్రహ్మం 1942-43, 1944-45 సంవత్సరాలలో రెండు సార్లు దక్షిణ భారత ఫిలిం వాణిజ్యమండలి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

రామబ్రహ్మానికి మధుమేహం వ్యాధి ఉంది. 
పల్నాటి యుద్ధం భారీ సినిమా నిర్మాణ సమయంలో (1946) హఠాత్తుగా అతనికి పక్షవాతం వచ్చింది. 
ఎన్ని మందులు వాడినా వ్యాధి తగ్గకుండా 
అక్టోబరు 1న కాలధర్మం చేశారు.

విజయవాడలో ఈడ్పుగంటి లక్ష్మణరావు కార్యదర్శిగా, అక్కినేని నాగేశ్వరరావు గౌరవాద్యక్షునిగా 'గూడవల్లి రామబ్రహ్మం సినీ కళాసాగర్' అనే సంస్థను స్థాపించి సుమారు పది సంవత్సరాలు నాటక, సినీ రంగాలకు సేవచేశారు.

తెనాలిలో రామబ్రహ్మం 30వ వర్ధంతి సందర్భంగా 1976 అక్టోబరులో 'రామబ్రహ్మం సంస్మరణ సంఘం' ఏర్పడి అతనితో సాన్నిహిత్యం ఉన్న ప్రముఖులతో విలువైన వ్యాసాలు రాయించి 'స్మారక సంచిక'ను ప్రచురించారు.

విజయవాడ గాంధీనగర్ లోని అలంకార్ సెంటర్ లో రామబ్రహ్మం కాంస్య విగ్రహాన్ని 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఆవిష్కరించారు.

గుడివాడ చరిత